Chinese goalkeeper fined for conceding goal while drinking water at the wrong time

Sip slip leaves thirsty chinese goalie in hot water

Chinese Super League, foot ball match, goalkeeper, Ding Haifeng, Sui Weijie, Chongqing Lifan goalkeeper Sui Weijie, 50,000 yuan fine, Rs. 5 lakh fine, 5,230 pounds fine, Sui Weijie faced suspension, Lifan supporters, Liaoning's Shenyang Airport

Quenching his thirst while on duty proved costly for Chongqing Lifan goalkeeper Sui Weijie, who has been fined for sipping water as their opponents equalised in a Chinese Super League match

గ్రౌండ్ లో నీళ్లు తాగినందుకు ఐదు లక్షల జరిమానా..!

Posted: 05/30/2015 08:42 PM IST
Sip slip leaves thirsty chinese goalie in hot water

ఫుట్బాల్ మ్యాచ్లో ప్రతీ క్షణం కీలకమైనది. జట్టులోని అందరి సభ్యులతో ముడిపడిన క్రీడ ఇది. ఏ ఒక్కరు తప్పు చేసినా.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అయితే.. ఫుట్ బాల్ గ్రౌండ్ లో నీళ్లు తాగినందుకు ఓ క్రీడాకారుడికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించారు. అదేంటి నమ్మశక్యంగా లేదా..? ఇది ముమ్మటీకీ నిజం. అయితే కేవలం నీళ్లు తాగినందుకే కాదండి. నీళ్లు తాగుతూ.. గోల్ వదిలేసినందుకు చైనాలో ఓ క్లబ్ గోల్ కీపర్ జరిమానా బారిన పడాల్సి వచ్చింది. అలాంటిది ఆట మధ్యలో ఏకంగా నెట్ను విడిచి పక్కన నించుని తాపీగా నీళ్లు తాగడమే అతడు చేసిన తప్పు. ఇంకేముంది ప్రత్యర్థి జట్టు మిడ్ఫీల్డర్ బంతిని నేరుగా గోల్పోస్టులోకి పంపాడు. గోల్ కీపర్ దాహార్తికి మ్యాచ్ విజయావకాశాలను చేజార్చుకున్నారు.  చైనా సూపర్ లీగ్ మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. గోల్ కీపర్ కు 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు.

చోంగ్గింగ్ లిఫాన్, లియోనింగ్ జట్ల ఫుట్బాల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మరో 7 నిమిషాలకు మ్యాచ్ ముగుస్తుందనగా, లిఫాన్ 1-0 ఆధిక్యంలో ఉంది. కాసేపు ప్రత్యర్థి జట్టును నిలువరించి ఉంటే విజయం వరించేదే. కాగా ఆ సమయంలో లియోనింగ్కు ఫ్రీ కిక్ అవకాశం వచ్చింది.  లియోనింగ్ మిడ్ఫీల్డర్ డింగ్ హైఫెంగ్ బంతిని గోల్ పోస్టు వైపు పంపాడు. అప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. లిఫాన్ గోల్ కీపర్ సూ వీజీ దాహం తట్టుకోలేక నెట్స్ పక్కన నీళ్లు తాగుతున్నాడు. దీంతో బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపో్యాడు. బంతి నేరుగా నెట్స్లోకి వెళ్లడం, అక్కడ గోల్ కీపర్ లేకపోయేసరికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆశ్చర్యపోగా, లిఫాన్ ఆటగాళ్లు షాక్ తిన్నారు. మ్యాచ్ 1-1తో సమమైంది. గోల్ కీపర్ చేసిన తప్పిదానికి లిఫాన్ విజయావకాశాలను చేజేతులా జారవిడుచుకుంది.  గోల్ కీపర్ నిర్లక్ష్యాన్ని జట్టు యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. సూ వీజీకి 5 లక్షల రూపాయల జరిమానా విధించి సస్పెండ్ చేశారు. ఘోరమైన తప్పిదాన్ని చేశానని, ఇలాంటి తప్పును ఇకమీదట చేయబోనని, ఆట మధ్యలో ఏకాగ్రత కోల్పోనని సూ వీజీ చెంపలేసుకున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese Super League  foot ball match  goalkeeper  

Other Articles