Michael phelps girlfriend taylor lianne chandler says she was born male

michael phelps, Taylor Lianne Chandler, Taylor Lianne Chandler latest news, michael phelps girlfriend, Taylor Lianne Chandler boyfriend, Taylor Lianne Chandler photos, Taylor Lianne Chandler hot photos, Taylor Lianne Chandler facebook, Taylor Lianne Chandler twitter

Michael Phelps girlfriend Taylor Lianne Chandler says she was born male

అబ్బాయితో ప్రేమాయణం నడిపిన క్రీడాకారుడు!

Posted: 11/22/2014 11:49 AM IST
Michael phelps girlfriend taylor lianne chandler says she was born male

అమెరికా స్విమ్మింగ్ దిగ్గజం మెకేల్ ఫెల్ప్స్ ప్రేమ వ్యామోహంలో పూర్తిగా మునిగిపోయి.. ఏకంగా అబ్బాయినే ప్రేమించేశాడు. అతనితోనే డేటింగ్’లు, పబ్బులు, టూర్లకు అంటూ షికార్లు చేసుకుంటూ బాగానే ఎంజాయ్ చేశాడు కూడా! అప్పటికీ ఆ విషయం అతనికీ కూడా తెలియదు.. తాను ప్రేమిస్తోంది అమ్మాయితో కాదు అబ్బాయితో అని! అంతా సవ్యంగానే జరుగుతుండేది కానీ.. అనుకోకుండా వారిమధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఇద్దరు విడిపోయారు. అలా వాళ్లిద్దరూ దూరమైన తర్వాత ఫెల్ప్స్’, అతని అభిమానుల షాకయ్యేలా అసలు రహస్యం బయటపడింది.

అసలు విషయం ఏమిటంటే.. మైకేల్ పెల్ప్స్ మాజీ ప్రేయసి టేలర్ లియాన్ చాండ్లర్ ప్రస్తుతం మహిళే కానీ.. ఒకప్పుడు కాదట! ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. మైకేల్ తనకంటే 12ఏళ్ల పెద్దదైన చాండ్లర్’తో కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపి, తర్వాత విడిపోయాడు. వీళ్లిద్దరు విడిపోయి చాలారోజులే అయింది కానీ.. తాజాగా ఆమె తనకు సంబంధించి కొన్ని రహస్యాలను వెల్లడించి, అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారిపోయింది. 41ఏళ్ల చాండ్లర్ తన ఫేస్’బుక్’లో.. ‘‘తాను పుట్టినప్పుడు అబ్బాయి లక్షణాలుండేవని.. అయితే యుక్తవయస్సు వచ్చినప్పుడు శస్త్రచికిత్స ద్వారా అమ్మాయిగా మారానని’’ పోస్టు చేసింది. అబ్బాయిగా వున్నప్పుడు తన పేరు డేవిడ్ రాయ్ ఫిచ్ అని పేర్కొన్న ఆమె.. లింగమార్పిడి చేయించుకున్న అనంతరం తన పేరుతోబాటు లింగ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మార్చుకున్నట్లు తెలిపింది.

అయితే ఈ రహస్యం తన మాజీ బాయ్’ఫ్రెండ్ మైకేల్’తోపాటు తన తర్వాత భాగస్వాములెవరికీ తెలియదని చాండ్లర్ చెప్పింది. మైకేల్’తో తన బంధం కొన్నాళ్లే సాగిందని.. ఆ సమయంలో అతడికి తన జీవితం గురించి చెప్పే అవకాశం రాలేదని.. కానీ అతడితో ఎన్నడూ అబద్ధం చెప్పలేదని చాండ్లర్ తెలిపింది. ఈమె ఈవిధంగా పోస్టు చేయడాన్ని చూసి.. మైకేల్ కు దగ్గర కావాలనే ఆలోచనతోనే ఇలా చేసి వుంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి.. ఈ వ్యవహారంపై మైకేల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taylor Lianne Chandler  michael phelps  swimming  telugu newsq  

Other Articles