Saina nehwal left from hongkong open super series

saina nehwal in hongkong open super series, saina nehwal in hong kong series, hongkong super series latest updates, hongkong super series match schedule, hongkong super series finals, sports latest news updates, china shetlor in hongkong super series

saina nehwal left from hongkong open super series : hyderabadi star shetlar saina nehwal faced defeat in hongkong open super series with china player

ఆశలు ఆవిరి.. హాంకాంగ్ టోర్నీ హుష్ కాకి

Posted: 11/21/2014 01:33 PM IST
Saina nehwal left from hongkong open super series

వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాదీ స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ కు పరాభవం ఎదురయ్యింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ లో సైనా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనా క్రీడాకారిణి తాయ్ జూయింగ్ చేతిలో 21-15, 21-19 సెట్ల తేడాతో సైనా ఓడిపోయింది. దీంతో టైటిల్ కైవసం చేసుకోవాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. సైనా నెహ్వాల్ తాజా ఓటమిపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ స్టార్ కు ఇలా జరిగిందేమిటా అని చింతిస్తున్నారు.

గురువారం జరిగిన పోరులో 21-16, 21-13 సెట్లతో ప్రపంచ 14వ ర్యాంకర్, మూడవ సీడ్ అయిన బీవెన్ జాంగ్ పై విజయం సాధించింది. అమెరికా క్రీడాకారిణిపై విజయం సాధించిన ఉత్సాహంతో శుక్రవారం బరిలోకి దిగిన సైనా.., తొలినుంచి ప్రత్యర్ధికి గట్టిపోటినే ఇచ్చింది. తొలి సెట్ లో కాస్త తడబడినా రెండవ సెట్ లో మరింత చాకచక్యంగా వ్యవహరించింది. అయితే అప్పటికే సమయం మించిపోయి పాయింట్ల పట్టికలో తాయ్ జూయింగ్ పైచేయి సాధించింది. దీంతో నిరాశగా వెనుతిరగక తప్పలేదు.

గతవారం జరిగిన చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ ను సైనా కైవసం చేసుకుని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అందర్నీ మట్టికరిపించి టైటిల్ భారత్ ఎగరేసుకుపోవటంపై డ్రాగన్ దేశం కూడా కళ్లప్పగించి హైదరాబాదీని చూసింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి సైనాను ఓడించి ప్రతీకారం తీర్చకుందని చెప్పవచ్చు. తాజా టోర్నీలో అనూహ్య తప్పిదాలే ఓటమికి కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  hongkong open super series  china  sports  latest news  

Other Articles