Saina nehwal press meet sports ministry sensational comments on athletes

saina nehwal, saina nehwal press meet, saina nehwal twitter, saina nehwal hot photos, saina nehwal hot photo shoot, saina nehwal shuttler, saina nehwal badminton, tennis star leander paes, sania mirza, pv sindhu, parupalli kashyap, indian sports persons, telugu sports news, telugu news, telugu movie news, sports ministry, indian sports ministry

saina nehwal press meet Sports Ministry sensational comments on athletes

అందరు ఆటగాళ్లు అలాంటివాళ్లే : సైనా

Posted: 10/31/2014 01:09 PM IST
Saina nehwal press meet sports ministry sensational comments on athletes

భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ గతకొన్నాళ్ల నుంచి ఆటలో తన ప్రతిభను సరిగ్గా ప్రదర్శించకపోవడంతో భారతీయ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఆమెపై విరుచుకుపడ్డారు. అలాగే యాజమాన్యంతోపాటు కొంతమంది ప్రముఖులు సైతం ఆమె ఆటతీరు గతంలోకంటే ఇప్పుడు అత్యంత పేలవగా వుందని, బాగోలేదంటూ అభిప్రాయాలు తెలిపారు. అదేవిధంగా దేశానికి అందుబాటులో వుండని అథ్లెట్లకు తమ నుంచి ఆర్థికసహాయం అందదని క్రీడామంత్రిత్వశాఖ స్పష్టం చేసింది కూడా! అంటే ప్రస్తుత ఆటగాళ్లందరూ కేవలం బహుమతులు, పతకాలకోసమే క్రీడలు ఆడుతున్నారని.. దేశభక్తి కోసం సరైన ప్రతిభ ప్రదర్శించకుండా వెనుదిరుగుతున్నారనే అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే సైనా నెహ్వాల్ కూడా తన మనసులోని భావాలను వ్యక్తపరిచింది.

భారతీయ క్రీడాభిమానులతోపాటు క్రీడామంత్రిత్వశాఖ వెల్లడించిన వ్యాఖ్యాల మీద సైనా నెహ్వాల్ స్పందిస్తూ.. తాను నగదు బహుమతులు, పతకాలకోసం ఆడటం లేదని, దేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసమే ఆడుతానని పేర్కొంది. ‘‘అందరూ క్రీడాకారులు దేశానికే ఆడాలని బావిస్తారు. గాయాలు లేదా ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే తప్ప.. అందరి ప్రాధాన్యం దేశమే! ప్రైజ్ మనీ టోర్నీల్లో కూడా ఎవరూ కేవలం ఆటగాడిగా వెళ్లరు. తాము దేశానికి ఆడుతున్నట్లుగానే భావించి బరిలోకి దిగుతారు. అక్కడ నగదు బహుమతి, పతకం కాదు.. దేశమే ముఖ్యం. నా దృష్టిలో దేశానికి ఆడడం చాలా ముఖ్యం’’ అని వివరించింది. అలాగే టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ కూడా సైనా తరహాలోనే స్పందించాడు. తాను 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్ లో చేసిందంతా కేవలం దేశంకోసమేనంటూ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  leander paes  indian sports ministry  sania mirza  

Other Articles