Bodda pratyusha got women international master title with the highest points in chess game

bodda pratyusha, bodda pratyusha chess, bodda pratyusha international master, chess players, indian chess players, telugu chess players, telugu sports persons, telugu news, telugu sports news, telugu movie news, telugu political news

bodda pratyusha got women international master title with the highest points in chess game

ప్రపంచ చెస్ మాస్టర్ జాబితాలో తెలుగమ్మాయి!

Posted: 10/30/2014 01:44 PM IST
Bodda pratyusha got women international master title with the highest points in chess game

పురుషులకంటే మహిళలకు ఏమాత్రం తక్కువ కాదంటూ అన్ని రంగాలలోనూ తమ సత్తా చాటుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఈమధ్యకాలంలో అయితే మహిళలు తమ వేగాన్ని మరింత పెంచేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులకంటే మహిళలే ఎక్కువ విజయాలను నమోదు చేయగలిగారు. ఆ క్రీడల్లో తెలుగు అమ్మాయిలు కూడా కీలకపాత్రను పోషించారు. బహుశా వారి స్ఫూర్తితోనే ప్రస్తుత క్రీడాకారులు దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో తెలుగమ్మాయి అయిన బొడ్డా ప్రత్యూష చెస్ క్రీడలో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ దక్కింది.

చెస్ క్రీడలో మొదటినుంచి బాగా ప్రదర్శించుకుంటూ మెరుగైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ప్రత్యూషకు ఈ టైటిల్ దక్కడం విశేషం! అక్టోబర్ నెలలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్ కు ముందు 2,078 పాయింట్లతో వున్న ప్రత్యూష.. ఆ టోర్నీలో 90 పాయింట్లను తన ఖాతాలో జమచేసుకుంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రంలో జరుగుతున్న జాతీయ మహిళ ప్రీమియర్ చెస్ టోర్నీలోనూ తన దూకుడును కంటిన్యూ చేస్తోంది. ఆ టోర్నీలోని ఐదో రౌండు ముగిసేసరికి ప్రత్యూష 42 రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో ఆమె మొత్తం 2210 పాయింట్లను సొంతం చేసుకున్న ప్రత్యూష.. ఐఎం టైటిల్ ను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ప్రత్యూష మాట్లాడుతూ.. గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యమని.. దీన్ని వచ్చే ఏడాదిలోపే పూర్తి చేస్తానని ఛాలెంజ్ చేసింది. ఇదిలావుండగా.. మహారాష్ట్రలో జరుగుతున్న జాతీయ ప్రీమియర్ చెస్ టోర్నీలో ప్రత్యూష ఐదో రౌండ్లో హిందూజా రెడ్డిని ఓడించి.. 2.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ వేగంతోనే ఈమె తన ప్రతిభను చాటుకుంటూ దూసుకెళ్తే.. త్వరలోనే తన కోరికను తీర్చుకునే అవకాశాలు చాలానే వున్నాయి. ఈమె ఇంటర్నేషనల్ మాస్టర్ గా టైటిల్ సాధించడంతో అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles