Saina nehwal lose french open super series badminton match against china player

saina nehwal, saina nehwal latest news, saina nehwal hot photo shoot, saina nehwal french open super series, indian badminton stars

saina nehwal lose french open super series badminton match against china player

సైనా వల్ల భారత్ కు రూ.1 కోటీ 70 లక్షల నష్టం!

Posted: 10/25/2014 05:18 PM IST
Saina nehwal lose french open super series badminton match against china player

సైనా నెహ్వాల్.. ఎందరో దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్లకు సాధ్యంకాని కొన్ని ఘనతలను సొంతం చేసుకుని ఓ సంచలనంగా నిలిచిపోయిన స్టార్! నెంబర్ వన్ చైనాను సైతం చెమటలు పట్టించి భారత్ కు అండగా నిలిచింది. ఎవ్వరూ సాధించలేని పతకాలను తన ఖాతాలో వేసుకుని బ్యాడ్మింటన్ చరిత్రలో ఇండియాకు గొప్ప పేరు సంపాదించిపెట్టింది. అటువంటి స్టార్ క్రీడాకారిణి చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు భారత్ కు ఏకంగా కోటి 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. మొన్నటివరకు ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ అమ్మడు... ఇప్పుడు ఆమె వల్లే భారత్ కు ఎంతో అగౌరవం మిగిలిందనే వార్తలు వస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. ఒలంపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన తర్వాత నుంచి సైనా నెహ్వాల్ వరుసగా జరుగుతున్న టోర్నమెంట్ లో ఓడిపోతూనే వుంది. ఏ ఒక్క టోర్నమెంట్లోనూ కనీసం రన్నరప్ వచ్చిన సందర్భాలూ లేవు. మహా అయితే క్వార్టర్ ఫైనల్ దాకా చేరుతోంది కానీ.. సెమీస్ లో కూడా స్థానం సంపాదించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఆసియా క్రీడల్లో, డెన్మార్క్ ఓపెన్ లో మొదట్లోనే వెనుదిరిగి వచ్చేసింది. దాంతో భారతీయ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే అంతలోనే మొదలైన ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో సైనా నెహ్వాల్ పోరాటం కొనసాగించింది. కానీ అందులో కూడా ఎటువంటి ఫలితం దక్కలేదు. పైగా అందులో పరాజయం కావడం వల్లే భారత్ కు ఇంత నష్టం వాటిల్లింది.

అయితే ఈ భారీ నష్టం ఏమిటంటే.. ఒకవేళ ప్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ సైనా నెహ్వాల్ గెలిచివుంటే ఆ ఆటపై వున్న కోటీ 70 లక్షల ప్రైజ్ మనీ దక్కి వుండేది. కానీ ఆమె క్వార్టర్స్ లోనే వెనుదిరగడం వల్ల చేతికందాల్సిన ఆ ప్రైజ్ మనీ ఒక్కసారిగా చేజారిపోయింది. దీంతో భారత్ కు రావాల్సిన ఆ డబ్బులు రాకుండా పోవడంతో నష్టం వచ్చిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. క్వార్టర్ ఫైనల్ లో చైనాకు చెందిన రెండో సీడెడ్ క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో సైనా 19-21, 21-19, 15-21 తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో ఆమె వరుసగా ఐదుసార్లు సైనాపై గెలిచినట్లయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles