Boxing legend muhammad ali suffering parkinson disease from long time

boxing legend muhammad ali, boxer muhammad ali news, muhammad ali health problems, boxer muhammad ali health problems, muhammad ali daughter hana, muhammad ali with daughter hana, muhammad ali movie, i am ali movie, muhammad ali hollywood movie

boxing legend muhammad ali suffering parkinson disease from long time due to this he didn't attend his movie premier

కనిపించకుండా పోయిన బాక్సింగ్ లెజెండ్ అలీ!

Posted: 10/24/2014 02:54 PM IST
Boxing legend muhammad ali suffering parkinson disease from long time

బాక్సింగ్ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ.. గత కొంతకాలం నుంచి కనిపించడం లేదంటూ హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చాలాకాలం నుంచి పార్కిన్సన్ అనే నరాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. అప్పటినుంచి అతని వివరాలు అంతగా బయటకు రావడం లేదంటూ కథనాలు వస్తున్నాయి. 72ఏళ్ల వయస్సున్న ఈ బాక్సింగ్ వీరుడు.. తన బాక్సింగ్ కెరీర్ లో ఆడిన మొత్తం 61 ఆటల్లో కేవలం 5 సార్లు మాత్రమే ఓడిపోయాడు. మిగతావన్నీ సంచలన విజయాలే! అటువంటి బాక్సింగ్ వీరుడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు వున్నారు. కానీ కొన్నిరోజుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోపాటు కొన్నాళ్ల నుంచి కనిపించకుండా పోవడం వల్ల టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది.

ఈ బాక్సర్ మహమ్మద్ అలీ జీవిత కథ ఆధారంగా ఇటీవలే ‘‘ఐ యామ్ అలీ’’ అనే హాలీవుడ్ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ మూవీ ప్రీమియర్ షోకు ఇతను హాజరు కాకపోవడం వల్ల అప్పటినుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇతను తీవ్ర అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాడని, అతని కుమార్తె హనా వద్ద వుంటూ విశ్రాంతి తీసుకంటున్నాడని మరో వార్త వెలుగులోకి వచ్చింది. అలీ ఆరోగ్యం బాగులేకపోవడం కారణంగా కూతురి వద్దే వుంటూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles