Football player peter bayaksangjuvala during goal celebrations

Football player Peter bayaksangjuvala, Football player Peter bayaksangjuvala died, mizoram premier league, football game, player died Football player Peter bayaksangjuvala celebrations

Football player Peter bayaksangjuvala during goal celebrations

నిండుప్రాణాలు బలితీసుకున్న ఫుట్బాల్ సంబరం!

Posted: 10/21/2014 01:49 PM IST
Football player peter bayaksangjuvala during goal celebrations

సాధారణంగా ఏదైనా క్రీడలో ఒక జట్టు గెలిచిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లందరూ మైదానంలోనే సంబరాలు చేసుకోవడం సర్వసాధారణం! గల్లీల ఆటగాళ్లనుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లందరూ గెలిచిన తర్వాత తీరు ఇలాగే వుంటుంది. అయితే మిగతా క్రీడలతో పోల్చుకుంటే.. ఫుల్ బాల్ లో గోల్ వేసిన తర్వాత ఆటగాళ్లు మరీ ఎక్కువగా సంబరాలు చేసుకుంటారు. ఎవడైనా గోల్ వేస్తే చాలు.. అతనిని నేలమీద పడుకోబెట్టి మిగతా ఆటగాళ్లందరూ అతనిమీద పడి దొర్లుతుంటారు. అతడు చచ్చాడా..? బతికున్నాడా..? అన్నది కాదు ముఖ్యం.. అతడి మీద పడి సంబరాల పేరుతో పొలాన్ని దున్నినట్టు దున్నేయడమే! అయితే అటువంటి సంబరమే ఒక నిండు ప్రాణాలను బలితీసుకుంది... తీరని విషాదాన్ని మిగిల్చింది.

మిజోరాం ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో భాగంగా బెత్లెహామ్ వెంగ్తలాంగ్ ఎఫ్‌సీ జట్టు తరఫున ఆడుతున్న పీటర్ బయాక్సంగ్జువాలా... తన ప్రతిభతో  అద్భుతమైన గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేశాడు. జట్టు ఓడిపోతున్న తరుణంలో ఇతడు గోల్ వేయడంతో ఇతడితోపాటు ఇతర ఆటగాళ్లందరూ అంతుపట్టలేని ఆనందంలో మునిగిపోయారు. మొదట గోల్ వేసిన అనంతరం ఆనందంతో ఊగిపోతూ తలకిందులుగా ఎగిరి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఈ 23 ఏళ్ల పీటర్... ఆ సమయంలోనే అనుకోకుండా తల నేరుగా నేలకు బలంగా తాకి పడిపోయాడు. దీంతో అతడి వెన్ను పూర్తిగా దెబ్బతింది. అప్పటికే ఇతడు స్పృహ కోల్పోయాడు. అయితే ఇతనికి జరిగిన ఈ విషాదాన్ని అక్కడ ఎవ్వరూ గమనించలేకపోయారు.

పైగా అతడు కిందపడిన సమయంలో ఇతర ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అతడిపై పడిపోయారు. అతనికి ఏం జరిగిందో, లేదోనన్న విషయం తెలుసుకోకుండా ఒకరిమీద ఒకరు పడిపోయారు. అలా పడిపోయిన అనంతరం ఒక్కొక్కరు పైకి లేస్తున్న తరుణంలో అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అతనికేమో జరిగిందని అందరూ భావించారు. తరువాత జరిగిన విషయాన్ని గమనించిన యాజమాన్యం.. వెంటనే అతనిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఫలితం మాత్రం దక్కలేదు... ఆదివారం అతడు ప్రాణాలు కోల్పోయాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles