Indian sports persons in asian games 2014

asian games 2014, asian games 2014 incheon, asian games incheon, sania mirza, sania mirza asian games, sania mirza asian games 2014, saina nehwal news, saina nehwal asian games 2014, saina nehwal latest news, mary kom, mary kom asian games, boxer akhil kumar, abhinav bindra

indian sports persons in asian games 2014 which are to be held in incheon

భారత గౌరవాన్ని నిలిపే సత్తాను చాటుకుంటారా..?

Posted: 09/17/2014 12:44 PM IST
Indian sports persons in asian games 2014

19వ తేదీ నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి.. దీంతో ఒకవైపు ఆటగాళ్లతోపాటు మన భారతీయుల్లో కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి భారత్ తరఫున ఈ క్రీడల్లో పాలుపంచుకుంటున్న ఆటగాళ్లు తమ సత్తాను చాటుకుని పతకాలు సాధిస్తారా..? లేదా..? మన ఇండియా గౌరవాన్ని నిలబెడుతారా..? లేదా..? అనే సందేహాల్లో మునిగిపోయారు. ఈసారి బరిలోకి దిగుతున్న ప్రతి ఒక్క అథ్లెట్ కూ ఈ క్రీడలు ఎంతో కీలకమైనవి. ఎన్నో అంచనాల మధ్య తాము ఈ రణరంగంలో దిగుతున్నారు. కొందరు యువ ఆటగాళ్లకి పరీక్షగా మారగా.. సీనియర్ ఆటగాళ్లకు సవాళ్లుగా మారాయి. పైగా ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతుండటంతో వారు అంచనాలను అందుకుంటారా..? ఇంచియాస్ క్రీడలను చిరస్మరణీయం చేసుకుంటారా..? లేదా..? అనే టెన్షన్ అందరిలో వుండిపోయింది. ఇందులో పాల్గొంటున్న క్రీడాకారుల విషయాలకు వస్తే...

సైనా నెహ్వాల్ : భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరెవ్వరికీ సాధ్యంకాని ఎన్నో ఘనతల్ని తన సొంతం చేసుకున్న క్రీడాకారణి. రెండెంకల సంఖ్యలో కూడా సూపర్ సిరీస్ లు ఆమె ఖాతాలో వున్నాయి. రెండేళ్ల క్రితం ఒలంపిక్స్ లో కాంస్యం కూడా గెలుచుకుంది. అయితే గతకొంతకాలం నుంచి ఈమె ఫామ్ చెప్పుకొదగినంతగా లేదు. దీంతో ఈమె ఈసారి నెగ్గుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారిపోయింది.

సానియా మీర్జా : నిన్న జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచిన సానియా మీర్జా... ఆసియా క్రీడల్లో అదే ప్రతిభతో పతకాన్ని అందుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లందరూ ఈ క్రిడల నుంచి తప్పించుకున్నప్పటికీ.. ఈమె మాత్రం ఆడాలని నిర్ణయించుకుని, భారత బృందానికి పెద్ద దిక్కులా మారిపోయింది. ఎందుకంటే.. ప్రస్తుతం వున్న ఆటగాళ్లందరిలో భారత్ కు పతకం అందించే సత్తా ఈమెకు మాత్రమే వుంది. అయితే మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ లో ఈమెకు సరైన భాగస్వామి లేరు. ఈ స్థితిలో సానియా పతకం నెగ్గితే.. అద్భుతమే అవుతుంది.

మేరీ కోమ్ : ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలవడమేగాకుండా.. ఒలంపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన మహిళ బాక్సర్ ఈమె! అయితే మొన్న జరిగిన కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో మేరీకోమ్ సంగతి అయిపోయిందని అందరూ భావించేశారు. కానీ మేరీ మాత్రం తన పట్టు వదలలేదు. చివరికి ఆసియా క్రీడల్లో  అర్హత సాధించింది. ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

అఖిల్ కుమార్ : సినిమాల్లో సల్మాన్ ఖాన్ ఎలా అలరిస్తాడో.. బాక్సింగ్ రింగ్ లో అఖిల్ అలాగే ఆకట్టుకుంటాడని సహచరుల అభిప్రాయం! 2006 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలిచి, లండన్ ఒలంపిక్స్ లో తృటిలో పతకం చేజార్చుకున్న అఖిల్.. ఆ తరువాత మరుగున పడిపోయాడు. 2012లో అఖిల్ ఒలంపిక్స్ లో అర్హత సాధించలేకపోవడంతో ఇతని కెరీర్ ముగిసినట్లేనని అనుకున్నారు. కానీ తాను ఎంతగానో శ్రమించి.. ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు. స్వర్ణాన్ని ఎలాగైనా తీసుకొస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

అభినవ్ బింద్రా : బీజింగ్ ఒలంపిక్స్ లో స్వర్ణం, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు గెలుచుకుని తన స్థాయి ఎంటో నిరూపించుకున్నాడు ఈ వీరుడు! ఏ విధంగా అయితే గొప్ప విజయంతో కామన్వెల్త్ క్రీడలకు వీడ్కోలు పలికాడో.. అలాగే ఆసియా క్రీడల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుని వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాడు. ఇతని ఫామ్ ను చూస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్ణం గెలుస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇతను ఆసియా క్రీడల్లో ఎలా ప్రదర్శిస్తాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asian games 2014  sania mirza  saina nehwal  abhinav bindra  mary kom  akhil kumar  

Other Articles