Saina nehwal to join at vimal kumar for coaching

badminton, saina nehwal, saina nehwal hot, pullela gopi chand, gopi chand acadamy, sports, latest news, vimal kumar, coaching, sports coaches

saina nehwal will join at vimal kumar institute for her badminton : soon saina nehwal will go to vimal kumar for badminton coaching

గోపిచంద్ కు గుడ్ బై చెప్తున్న సైనా

Posted: 09/02/2014 11:34 AM IST
Saina nehwal to join at vimal kumar for coaching

గురువుకు గుడ్ బై చెప్పేందుకు సైనా సిద్ధమైంది. ఇన్నాళ్లు మెడళ్ళు తెచ్చిపెట్టిన గోపిచంద్ ను వదలి మరొకరి వద్ద శిష్యరికం చేసేందుకు వెళ్తోంది. బ్యాడ్మింటన్ లో సక్సెస్ గురు, శిష్యగా పేరున్న సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ త్వరలో విడిపోతున్నారు. గోపి కోచింగ్ వల్ల సైనా న్నో పతకాలు సాధించింది. ప్రపంచస్థాయిలో తన సత్తా చాటింది. ఒలంపిక్స్ లో కాంస్యం గెలవటంతో పాటు అనేక ఇంటర్నేషనల్ టైటిళ్ళు కైవసం చేసుకుంది. అయితే ఈ మద్య హైదరాబాదీ తన ఫాం కోల్పోయింది.

ఇటీవల సైనా ఆడుతున్న మ్యాచ్ లలో అంతగా దూసుకెళ్లటం లేదు. తన కంటే వెనకున్న షెట్లర్లు ముందుకు వస్తుండగా.., సైనా ప్రతిభ చూపలేకపోతుంది. దీంతో కోచింగ్ పై దృష్టి పెట్టింది. ఒకే రకం ఆట వల్ల సీక్రెట్ తెలిసిపోయిన మిగతా వారు తనను అధిగమిస్తున్నారని భావించింది. కొత్త కిటుకులు నేర్చుకునేందుకు సిద్ధమై కోచ్ ను కూడా వెతుక్కుంది. బెంగళూరులోని విమల్ కుమార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని సైనా భావిస్తోందట. ఈ విషయం గోపి చంద్ కు డెన్మార్క్ చాంపియన్ షిప్ సమయంలోనే చెప్పగా ఆయన కూడా ఓకే అన్నారట.

గతంలో ఉబెర్ కప్ సమయంలో విమల్ ఇచ్చిన సలహాలు సైనాకు మంచిగా ఫలితాన్నిచ్చాయి. దీంతో ఫాం కోల్పోయిన తాను ఆయన దగ్గరకు వెళితే మెరుగవుతానని సన్నిహితులతో చెప్తోందట. త్వరలో ఆసియా ఇంటర్నేషనల్ టోర్నీ ఉండటంతో ప్రత్యేక కోచింగ్ కోసం బెంగళూరుకు లగేజ్ సర్దుకుంటోంది సైనా. అయితే పర్మనెంట్ గా బెంగళూరుకు ప్యాకప్ కావటం లేదని.., ఆసియా టోర్ని అయిపోగానే తిరిగి హైదరాబాద్ వచ్చేస్తానని చెప్తోంది.

సైనా గోపిని వదలటం ఇది కొత్తేం కాదు. గతంలో 2011 సంవత్సరంలో భాస్కర్ బాబు వద్దకు కోచింగ్ కు వెళ్లి మూడు నెలల తర్వాత తిరిగి గోపిచంద అకాడమికే వచ్చి చేరింది. ఇప్పుడు కూడా పుల్లెలను వదిలి వెళ్తోంది. అయితే ఇది కూడా తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది ఇంకా తెలియదు. పర్మనెంట్ గా విమల్ దగ్గర సెటిల్ అయినా ఆశ్చర్యం అవసరం లేదని స్పోర్స్ట్ అనలిస్టులు అంటున్నారు. చూడాలి మరి సైనా ఏం చేస్తుందో. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆసియా కప్.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  gopi chand  vimal kumar  sports  

Other Articles