Haryana govenment presenting high prize money for commonwealth and asia games winners

commonwealth games 2014, asia games 2014, haryana government latest news, haryana cm bhupendar singh latest news, haryana government high prize money for players, commonwealth games winners, asia games winners, haryana cm bhupendar singh comments on commonwealth games players

haryana govenment presenting high prize money for commonwealth and asia games winners

క్రీడాకారుల పతకాలతో బేరాలాడుతున్న ప్రభుత్వం

Posted: 07/31/2014 01:00 PM IST
Haryana govenment presenting high prize money for commonwealth and asia games winners

(Image source from: haryana govenment presenting high prize money for commonwealth and asia games winners)

కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో తమ సాయశక్తులను ఉపయోగించి క్రీడాకారులు ఎంతో కష్టంగా పతకాలను గెలుచుకుంటే... దానిని ప్రభుత్వం మాత్రం బేరాలాడుతూ సింపుల్ గా పనిని కానిచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ బేరాలాడుతున్నది తమ సొంత ప్రయోజనాలకోసం కాదులెండి... క్రీడల్లో ఎవరైతే మంచి ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆ పతకానికి తగ్గట్టు బహుమానాలను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం. ప్రత్యేకంగా తమ రాష్ట్ర క్రీడాకారుల కోసమే ఈ భారీ నజరానాను వారు ఏర్పాటు చేశారు.

కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలతో బాగా రాణించిన క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం సదరు ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని బహుమతిగా సమర్పించనున్నట్టు ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిస్తే కోటి రూపాయలుకాగా.. రజతానికి రూ.50 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షల నజరానాను ఇస్తున్నట్టు ఆ ప్రభుత్వం పేర్కొంది. అయితే గతంలో మాత్రం స్వర్ణానికి 25 లక్షలు, రజతానికి రూ.10 లక్షలు, కాంస్యానికి రూ.5 లక్షలు మాత్రమే వుండగా... ఇప్పుడు తాజాగా భారీ నజరానాను ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

అలాగే ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం పొందినవారికి రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్టు కూడా పేర్కొంది. గతంలో మాత్రం స్వర్ణానికి రూ.25 లక్షలు, రజతానికి రూ.15 లక్షలు, కాంస్యానికి రూ.10 లక్షల నజరానాను మాత్రమే ప్రకటించింది. ఈమేరకు బుధవారంనాడు హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ ఈ కొత్త నజరానాలను ప్రకటించించారు. ప్రస్తుతం జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తమ ఆటగాళ్లు బాగా రాణిస్తున్న నేపథ్యంలో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా భారీ నజరానాను ప్రకటించేశారు.

ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన కొందరు క్రీడాకారులు 3 స్వర్ణ, 5 రజత పతకాలను గెలుచుకున్నారని ఆయన అన్నారు. తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను మరింతగా ప్రోత్సాహించడం కోసమే ఇంత భారీ నజరానాను ప్రకటించామని ఆయన స్పష్టం చేశారు. సహజంగానే హర్యానా రాష్ట్రం క్రీడాకారులను ప్రోత్సాహించడంలో మిగతా రాష్ట్రాలకంటే ఎంతో ముందుంది. గతంలో ఒలంపిక్స్ క్రీడలు జరిగినప్పుడు కూడా హర్యానా ప్రభుత్వం తమ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ స్వర్ణ పతకానికి రూ.5 కోట్లు, రజతానికి రూ.3 కోట్లు, కాంస్యానికి రూ.2 కోట్లమేర నజరానాను ప్రకటించి క్రీడాలోకం నుంచి ఎన్నో మన్ననలు పొందింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles