India bags 7 medals in commonwealth games

India bags 7 medals in commonwealth games 2014, commonwealth games 2014, indian medals, india commonwealth games, india commonwealth games 2014, glasco commonwealth games 2014, 2014 commonwealth games, judo commonwealth games 2014, weight lifting commonwealth games 2014, commonwealth games india 2014, india medals commonwealth games

India bags 7 medals in commonwealth games 2014

కామన్వెల్త్ లో భారత్ శుభారంభం

Posted: 07/25/2014 01:02 PM IST
India bags 7 medals in commonwealth games

గ్లాస్గోలో జరుగుతున్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఏడు పతకాలను సొంతం చేసుకుంది. భారత్ ఆటగాళ్లు తమతమ కేటగిరీ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో కనబరిచి, దేశ గౌరవాన్ని కాపాడారు. తొలిరోజు వెయిట్ లిఫ్టింగ్ అంశంలో 6 కేటగిరీల్లో పతకం కోసం యాజమాన్యం పోటీలు నిర్వహించగా... అందులో భారత్ 4 పతకాలతో తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా అందులో రెండు స్వర్ణ పతకాలు వుండటం ఎంతో విశేషనీయమైనది.

మహిళల 48 కిలోల విభాగంలో భారత్ మహిళా క్రీడాకారిణి సంజిత పసిడి పతకాన్ని సాధించగా.. సైకోమ్ చాను రజిత పతకాన్ని సొంతం చేసుకుంది. అలాగే పరుషుల 56 కిలోల కెటగిరీలో సుఖేన్ డే అనే భారత్ ఆటగాడు స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంటే... అదే విభాగంలో గణేశ్ మాలి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఇలా ఈ విధంగా వెయిట్ లిఫ్టింగ్ అంశంలో భారత్ నాలుగు పతకాలను సాధించి, అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

ఇదిలావుండగా భారత్ జూడో క్రీడాంశంలో కూడా మూడు పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో నవ్ జోత్ చనా రజత పతకాన్ని సొంతం చేసుకుంటే... మహిళ 48 కేజీల విభాగంలో సుభీలా లిక్మబామ్ కూడా రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక మహిళల 52 కిలోల విభాగంలో కల్పనా తౌడమ్ అనే భారత్ మహిళా క్రీడాకారిణి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. దీంతో తొలిరోజే భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరిపోయాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles