Lionel messi won golden ball award in 2014 fifa world cup

Lionel messi won golden ball award in 2014 fifa world cup, lionel messi latest news, lionel messi won golden ball award, lionel messi grabs the golden ball award in fifa world cup 2014, lionel messi latest news,

Lionel messi won golden ball award in 2014 fifa world cup

గోల్డెల్ బాల్ అవార్డును స్వాధీనం చేసుకున్న మెస్సీ!

Posted: 07/14/2014 06:38 PM IST
Lionel messi won golden ball award in 2014 fifa world cup

(Image source from: Lionel messi won golden ball award in 2014 fifa world cup)

ఫిఫా వరల్డ్ కప్ 2014లో అర్జెంటీనా - జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా పరాజయం పాలయిన విషయం తెలిసిందే! అయితే ఆ జట్టులో స్టార్ ఆటగాడు అయిన లియోనెల్ మెస్సీ ప్రపంచకప్ 2014 గోల్డెన్ బాల్ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం సాకర్ గేమ్ లో తన జట్టు తరఫున అతను చూపించిన ప్రతిభకు ఈ అవార్డు దక్కింది. నాకౌట్ రౌండ్ లలో ఒక్క గోల్ చేయకపోయినా.. నాలుగు గ్రూప్ దశలలో మాత్రం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ఈ విధంగా తాను తన జట్టుకు మార్గనిర్దేశకునిగా వుంటూ ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు. ఫైనల్ లో కూడా తాను గోల్స్ వేయడానికి ఎంత ప్రయత్నించినా.. జర్మనీ ఆటగాళ్లు తెలివిగా ఇతనిని చుట్టుముట్టి గోల్స్ వేయడానికి అడ్డుపడ్డారు. తన సాయశక్తుల టీంని గెలిపించడానికి ఎంత శ్రమించినా.. చివరికి ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క విధంగా ప్రత్యర్థులను బురిడీ కొట్టించి ఇతను గోల్స్ వేసిన విధానం ప్రతిఒక్కరిని అబ్బుపరిచాయి. ఇతను చూపించిన ప్రదర్శనకు ప్రపంచవ్యాప్తంగా ఇతనికి అభిమానులు పుట్టుకొచ్చేశారు. ఇంతవరకు అర్జెంటీనా టీంలో మెస్సీలాంటి అద్భుతమైన ప్రభిభను ప్రదర్శించిన ఏ ఆటగాడు లేరని కొంతమంది కితాబిచ్చారు కూడా! మొత్తం టోర్నమెంట్ లో అతను వేసే గోల్ ఎంతో ప్రదాకరమైనదని, దానిని అడ్డుకోవడం అంత సులభం కాదని కొంతమంది గోల్ కీపర్లు కూడా అతనిని పొగిడారు.

సెమీ ఫైనల్ మ్యాచ్ లో డచ్ వారితో ఆడుతున్నప్పుడు ఇతను తన ప్రతిభను అంతగా ప్రదర్శించలేకపోయాడు. ఎందుకంటే.. ఆ సమయంలో ముగ్గురు డచ్ ఆటగాళ్లు ఇతనిని టార్గెట్ చేసి, గోల్ వేయకుండా ముట్టడించారు. తాను ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యర్థుల ఆటగాళ్లు మాత్రం ఇతనికి తేనెటీగళ్లాగా అతుక్కునిపోయి వుండేవాళ్లు. దాంతో ఇతను ఆ మ్యాచ్ లో ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాడు. అయితే స్విట్జర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మార్గం ఇతను ఒక కీలకపాత్రను పోషించాడు. ఆట మొదలైనప్పటికీ నుంచి ఒక్క గోల్ కూడా సాధించలేని అర్జెంటీనా జట్టు... చివరి నిముషాల్లో మెస్సీ అందరినీ షాక్ కు గురిచేసేలా గోల్స్ వేసి, జట్టును గెలిపించాడు. ఆ సమయంలో అతని గోల్ వేసే విధానం ఎంతో అమోఘం.

మెస్సీ తన క్లబ్ లో ప్రదర్శించిన అద్భుత తీరు ఇలా అంతర్జాతీయ వేదికపై స్థానం సంపాదించుకునేందుకు అవకాశంగా మారింది. టోర్నమెంట్ ఎంటర్ అయిన మెస్సీ, రొనాల్డో, నెయ్ మార్ ల మధ్య జరిగిన బెస్ట్ ప్లేయర్ల పోటీలలో మెస్సీ చాలా సులభంగా తన్నుకుపోయాడు. మెస్సీ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన జట్టును గెలుపుబాటలో నడపడానికి అన్నివిధాలుగా సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. 1990 తరువాత అర్జెంటీనా జట్టు తిరిగి 2014లో తన ప్రతిభను చాటిచెప్పిందంటే దానికి మెస్సీయే కారణమని ఆ జట్టు తరఫున వున్న ఆటగాళ్లందరూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles