Four sunrisers hyderabad players part of the mess

sunrisers hyderabad, hanuma vihari, ashih reddy, thisara perera, karan sharma, clt20, champions league twenty20 2013, spot fixing, ipl spot fixing, ipl 6, ipl scandal

Players by the name of 'Perera, Bihari, Ashish Reddy and Karn Sharma' were mentioned in the statement given by bookie Chandresh Patel to the cops.

ఫిక్సింగ్ లో హైదరాబాద్ ఆటగాళ్ళు

Posted: 10/17/2013 07:11 PM IST
Four sunrisers hyderabad players part of the mess

ఐపీఎల్ సీజన్ 6లో భారీ ఫిక్సింగ్ జరిగినట్లు ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, చెన్నై జట్ల విషయంలో రుజువైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సంచలన వార్త బయటకు వచ్చింది. గత సీజన్ లోనే కొత్తగా అడుగు పెట్టిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కూడా ఫిక్సింగ్ కి పాల్పడినట్లు బుకీ పటేల్ పోలీసులకు వెల్లడించడంతో ఈ వార్త సంచనలం రేపుతుంది. ఇప్పటికే శ్రీశాంత్ పై జీవిత కాల నిషేదం విధించగా, మరో ఇద్దరి ఆటగాళ్ళకు కూడా శిక్షను విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ జట్టుకు చెందిన నలుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ముంబై పోలీసుల విచారణలో బుకీ చెప్పడం, దాన్ని ఛార్జిషీట్లో చేర్చడం పెద్ద సంచలనం రేపుతుంది. సన్‌రైజర్స్‌కు చెందిన నలుగురు క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు చంద్రేష్ శివ్‌లాల్ పటేల్ అనే బుకీ ముంబై పోలీసులకిచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు. ఏప్రిల్ 17న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను సన్‌రైజర్స్ ఆటగాళ్లు తిసార పెరెరా, హనుమ విహారి, ఆశిష్ రెడ్డి, కర్ణ్ శర్మలు కలిసి రూ. 6 కోట్లకు ఫిక్స్ చేశారని పటేల్ ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు వెల్లడించాడని హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్ తెలిపింది. బుకీ ఇచ్చిన స్టేట్ మెంటు ప్రకారం.. ఏప్రిల్ 16న సునీల్ అనే వ్యక్తి మాకు సన్‌రైజర్స్ ఆటగాళ్లు పెరెరా, విహారి, కర్ణ్ శర్మ, ఆశిష్ రెడ్డి అతని సోదరుడు ప్రీతమ్ రెడ్డిలను పరిచయం చేశాడు. మేం ఏం చేయాలని ప్రీతమ్ రెడ్డి అడిగాడు. మొదటి 10 ఓవర్లలో స్కోరు 60, 20 ఓవర్లు ముగిసే సరికి 140 పరుగులు దాటకూడదు. హైదరాబాద్ ఓడిపోవాలని డీల్ కుదుర్చుకున్నాం. ఆ తర్వాత రోజు ఆమిర్ ఫోన్ చేసి రెండో ఓవర్లో హైదరాబాద్ ఆ టగాడు అవుటవుతాడు అదే సిగ్నల్ అనిచెప్పాడు. అన్నట్టుగానే రెండో ఓవర్లో హైదరాబాద్ ఆటగాడు అవుటయ్యాడు. తొలి పది ఓవర్లలో జీతూ (బుకీ) రూ. 3.5 కోట్లు, మ్యాచ్ మొత్తమ్మీద రూ. 9 కోట్లు బెట్ పెట్టాడు. తొలి 10 ఓవర్లలో బెట్ నెగ్గాడు కానీ, ఆ తర్వాత హైదరాబాద్ నెగ్గడంతో నష్టపోయాడు  అని పటేల్ తన స్టేట్‌మెంట్‌లో ఆరోపించాడు. అయితే శ్రీలంక ఆటగాడు పెరారీ ఫిక్సింగ్ కి పాల్పడ్డాడనే ఆరోపణల పై ఆ బోర్టు స్పందించి ఇవన్నీ నిరాధారణమైనవని తేల్చింది. ఇటు సన్ రైజర్స్ మేనేజర్ షణ్ముగం వీటిని కొట్టి పారేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Icc world twenty20 qualifier

    ICC world T20, 2014 Bangaladesh

    Nov 09 | Time & Date Match Venue Nov 15, 2013 10:00 local time | 06:00 GMT 4th Match, Group B: Bermuda vs Scotland Sharjah Nov 15, 2013 10:00 local time... Read more

  • Telugu content

    Sri Lanka v New Zealand

    Nov 09 | Time & Date Match Venue Nov 10, 2013 14:30 local time | 09:00 GMT 1st ODI: Sri Lanka vs New Zealand Hambantota Nov 12, 2013 14:30 local time... Read more

  • Telugu content

    India v West Indies

    Nov 09 | Date and Time Match Details and Series Wed Nov 6 - Sun Nov 10 09:00 local | 03:30 GMT 1st Test - India vs West Indies Eden Gardens, Kolkata Thu... Read more

  • Telugu content

    England in Australia - The Ashes

    Nov 09 | The Ashes 2013/14 will start from Nov 21-25, 2013 as per The Ashes 2013/14 Schedule. The Ashes 2013/14 Time Table & Fixture is prepared by... Read more

  • Telugu content

    Pakistan v South Africa

    Nov 09 | Series starts on Oct 14 2013 and ends on Nov 15 2013 Series Details: 2 Tests, 5 ODIs, 2 T20s Date Match Details Time Venue... Read more