Mithali Raj retires from T20I cricket మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటన.. టీ-20లకు స్వస్తి..

Mithali raj retires from t20is to focus on 2021 odi world cup

Mithali Raj, Mithali Raj T20I retirement, Mithali Raj news, India womens cricket team, India womens cricket, mithali raj t20i cricket, mithali raj announces retirement, sports news, cricket news, sports, cricket

Mithali Raj has announced retirement from T20 Internationals. She led India in 32 T20Is India including 3 Women's T20 World Cups in 2012 (Sri Lanka), 2014 (Bangladesh) and 2016 (India).

మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటన.. టీ-20లకు స్వస్తి..

Posted: 09/03/2019 07:01 PM IST
Mithali raj retires from t20is to focus on 2021 odi world cup

భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తన కల సాకారం చేసుకోవడం కోసం ఆమె అత్యంత కీలమైన కెరీర్ నే పనంగా పెట్టారు. తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకువచ్చిన క్రికెట్ కెరీర్ కన్నా ఉన్నతమైన స్వప్నం ఏంటనేగా మీ సందేహం. దేని కోసం 36 ఏళ్ల మిథాలీ.. ఈ నిర్ణయం తీసుకుంది.? క్రికెట్ అంటే కేవలం అంతర్జాతీయ టీ20 కెరీర్ కు ఆమె వీడ్కోలు ప్రకటించింది. ఇంతకీ అమె కల ఏమిటంటారు.? అంటే టార్గెట్ 2021 ఐసీసీ వన్డే వరల్డ్ కప్.

ప్రపంచ కప్ ను సాధించేందుకు ఆమె టీ20 మ్యాచ్ కెరీర్ ను పక్కనబెట్టారు. ఇప్పటివరకు మిథాలీ భారత తరపున మొత్తం 32 టీ20 మ్యాచులు ఆడింది. అందులో మూడు ఎడిషన్లు (2012 (శ్రీలంక , 2014 (బంగ్లాదేశ్, 2016 ఇండియా) మహిళల వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లు ఆడింది. ‘2006 నుంచి భారత మహిళా క్రికెట్ జట్టుకు టీ20అంతర్జాయ మ్యాచులకు కెప్టెన్ గా వ్యహరిస్తూ వచ్చాను. అంతర్జాతీయ టీ20ల నుంచి వీడ్కోలు పలకాలని భావిస్తున్నాను. రానున్న 2021 వన్ డే వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాను. అందుకు తగినట్టుగా రెడీ కావాల్సిన అవసరం ఉంది. నా దేశం కోసం ప్రపంచ కప్ లో విజయం సాధించడమే నా కల. నాకు సాధ్యమైనంత వరకు కష్టపడతా’ అని మిథాలీ చెప్పినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

‘భారత మహిళా టీ20ను ప్రోత్సహించిన బీసీసీఐకి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో హోం సిరీస్ కు సిద్ధమయ్యే భారత మహిళా టీ20 జట్టుకు నా శుభాకాంక్షలు’ అని మిథాలీ ట్వీట్ చేసింది. టీ20 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 2వేలు పరుగుల ల్యాండ్ మార్క్ చేరిన తొలి భారతీయ క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. మరోవైపు.. భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 హోం సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి-మార్చి 2020లో ఆస్ట్ర్రేలియాలో టీ20 ప్రపంచ కప్ ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithali Raj  retirement  T20s  India womens cricket team  2021 ODI world cup  sports  cricket  

Other Articles