Bumrah the most complete bowler, says Kohli బూమ్హ్రా పరిపూర్ణ బౌలర్ అంటూ కోహ్లీ ప్రశంసలు

Jasprit bumrah the most complete bowler around says virat kohli

virat kohli, test Cricket, Sabina Park, Jasprit Bumrah, Hanuma Vihari, Cricket World Cup, caribbean, Cricket news, sports news, Cricket, sports

India skipper Virat Kohli feels Jasprit Bumrah is the most complete bowler in world cricket right now and with his work ethic, the speedster has long shed the tag of being just a T20 specialist.

బూమ్హ్రా పరిపూర్ణ బౌలర్ అంటూ కోహ్లీ ప్రశంసలు

Posted: 09/03/2019 06:11 PM IST
Jasprit bumrah the most complete bowler around says virat kohli

అంతర్జాతీయ క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం పరిపూర్ణ బౌలరని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తన కెప్టెన్సీలో బూమ్రా ఆడటం తన అదృష్టంగా పేర్కోన్నారు. తన సారథ్యంలోని జట్టు విజయాలలో భాగమైన వారిలో బూమ్రా పాత్ర కూడా చాలా వుందని అన్నాడు. బుమ్రా స్వింగ్‌, పేస్‌, వైవిధ్యంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్లను తికమకపెడుతున్నాడని అన్నాడు. కేవలం పోట్టి ఫార్మెట్ క్రికెట్ స్పెషలిస్టు బౌలర్ గా ఆయనపై వేసిన ముద్రను తాను తుడుచుకోగలిగాడని అన్నారు.

టీ 20 బౌలర్ అని ముద్రపడ్డ ఒక ఆటగాడు వన్డేలపై ఆధిపత్యం చెలాయించాడని, ఇక తాజాగా ఇప్పుడు టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక ఆటగాడు ‘ఒకే ఫార్మాట్‌కు ప్రత్యేకం’ అని ముద్రవేయడం ఎంత తప్పో అతడు నిరూపించాడు’ అని విరాట్‌ అన్నాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ కావాలని బుమ్రా కచ్చితంగా కోరుకున్నాడు. క్రమశిక్షణ, పనితీరుతో తన జీవితాన్ని అలా మలుచుకున్నాడని అన్నారు.

తన శిక్షణ, ఆహారంపై జాగ్రత్త వహిస్తాడు. తను చేయాలనుకున్న పనిపై పూర్తి నియంత్రణతో ఉంటాడు. బుమ్రా బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదు. అతడు మా జట్టులో ఉండటం మా అదృష్టం. అతడు జోరుమీదుంటే తొలి 5-6 ఓవర్లలోనే కొత్త బంతితో పని పూర్తిచేస్తాడు. అతడు తొలి ఇన్నింగ్స్ లో వేసిన స్పెల్‌ కన్నా భయంకరమైన బౌలింగ్‌ ఇంతకు ముందు చూడలేదు. అతడి బౌలింగ్‌లో స్లిప్‌లో నిలబడి బ్యాట్స్‌మెన్‌ కోసం ఫీలవ్వక తప్పదు’ అని కోహ్లీ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  test Cricket  Sabina Park  Jasprit Bumrah  Hanuma vihari  Cricket  sports  

Other Articles