సారా టేలర్... ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ తన బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్... ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ కారణంగానే ఆమె ఈ మధ్యకాలంలో చాలా క్రికెట్ మ్యాచ్‌లకు సైతం దూరమైంది.
గత కొంతకాలంగా ఆందోళన సమస్యతో బాధఫడుతున్న సారా టేలర్ ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరిస్‌కు సైతం దూరమైంది. ఇటీవలే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సారా సర్రే స్టార్స్ తరుఫున మంచి ప్రదర్శన చేసింది. అయితే, బుధవారం సారా టేలర్ తన నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అందులో దుస్తులేమీ లేకుండా వికెట్ కీపింగ్ చేస్తోంది.
కాగా తాను కంఫర్ట్ జోన్‌ను దాటుకుని మరీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా సారా టైలర్ వివరణ ఇచ్చారు. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే తాను ఇలాంటి సాహపం చేశానని వివరించారు. ప్రతీ మహిళ అందంగానే వుంటుందని కూడా అమె పేర్కోన్నారు. ఈ మంచి పనికి తనను ఆహ్వానించిన ఉమెన్స్ హెల్త్ యుకే ఆర్గనైజేషన్‌కు సారా ధన్యవాదాలు తెలిపారు.
‘‘ఫోటో షూటింగ్లో సౌకర్యవంతంగా లేనప్పటికీ మంచి కారణం కోసం ధైర్యంగా అడుగు వేసాను. నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్హెల్త్ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది. దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే" అంటూ సారా టేలర్ వివరణ ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more