Chahal asks BCCI if he is being missed.? బిసిసిఐపై తనదైన శైలిలో చాహల్ ఫన్ని కామెంట్

Chahal comes up with hilarious comment as rohit sharma interviews pant

Rohit Sharma, Rishab Pant, yuzvendra chahal, Funny comments, Interview, BCCI, INDvsWI, india tour of west indies, T20 series, India vs West indies, cricket news, sports news, cricket, sports

India vs West Indies: Yuzvendra Chahal, who was not part of the T20I squad in West Indies, reminded the BCCI about his famous ‘Chahal TV’ post-match interviews with Indian team members.

బిసిసిఐపై తనదైన శైలిలో చాహల్ ఫన్ని కామెంట్

Posted: 08/08/2019 04:19 PM IST
Chahal comes up with hilarious comment as rohit sharma interviews pant

వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌ టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసి అదరగొట్టింది. మూడో టీ20లో పంత్‌ నాటౌట్‌ గా నిలిచి (42 బంతుల్లో 65)చెలరేగడంతో టీమిండియా ముచ్చటగా మూడో టీ 20లోనూ విజయాన్ని సాధించి విండీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే మ్యాచ్‌ అనంతరం ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్‌ను ఇంటర్వ్యూ చేశాడు,

ఈ వీడియో క్రికెటర్లు ఎవరో రికార్డ్ చేయగా.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో బీసీసీఐ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ కు యువ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు జోడించి రీట్వీట్‌ చేశాడు. దీంతో చాహల్ లోని ఈ యాంగిల్ ను కూడా చూసిన నెట్ జనులు, క్రికెట్ అభిమానులు వహ్ వా అంటూ కితాబిస్తుండగా, మరికోందరు మాత్రం బిసిసిఐ పైనే వ్యంగాస్త్రాలు సంధిస్తావా.? అంటూ వార్న్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్ ఏమిటంటే.. ‘మిస్సింగ్‌ మీ’ (నన్ను కోల్పోతున్నారు) అంటూ బీసీసీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

సహజంగా చాహల్‌ టీవీ ద్వారా అతడే టీమిండియా ఆటగాళ్లని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటాడు. ఈసారి రోహిత్‌ తన పాత్ర పోషించాడు. దీంతో అతడు సరదాగా ట్వీట్‌ చేశాడని తెలుస్తోంది. పంత్‌ వీడియోలో మాట్లాడుతూ.. తన ఆటమీద నమ్మకముందని, అందుకు తగ్గట్టే కొన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయినా మూడో టీ20లో మంచి బ్యాటింగ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. తొలుత మంచి భాగస్వామ్యం నిర్మించాక ఆఖరి ఓవర్లలో చెలరేగాలని నిర్ణయించుకున్నట్లు పంత్‌ పేర్కొన్నాడు.

మరోవైపు టీ20 సిరీస్‌లో ఆడని చాహల్‌ వన్డే సిరీస్‌కు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే అతడు జట్టుతో కలిశాడు. నేటి నుంచి విండీస్‌ X భారత్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా వన్డే ఆడటం ఇదే తొలిసారి. టీ20 సిరీస్‌లాగే వన్డే సిరీస్‌ను గెలుపొందాలని కోహ్లీసేన పట్టుదలగా కనిపిస్తుంది. ధావన్‌, రోహిత్‌, కోహ్లీతో పాటు రాహుల్‌, రిషబ్‌పంత్‌తో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Rishab Pant  yuzvendra chahal  Funny comments  Interview  BCCI  INDvsWI  cricket  sports  

Other Articles

 • Sarah taylor reveals the reason for posting her nude image

  ఇన్ స్టాగ్రామ్లో ఇంగ్లండ్ ఉమెన్ కీపర్ సారా టైలర్ ‘ఆ’ ఫోటో

  Aug 14 | సారా టేలర్... ఇంగ్లాండ్‌కు చెందిన ఈ క్రికెటర్ తన బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్... ఈ మధ్య... Read more

 • Ravindra jadeja gives death stare to umpire for a wide

  బ్యాట్స్ మెన్ కోపాన్ని చూసి వైడ్ ఇ చ్చిన అంఫైర్

  Aug 12 | భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఫీల్డ్ అంపైర్ తప్పిదాలపై విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్‌ తొలి ఓవర్ లోనే శిఖర్ ధావన్‌ ఎల్బీడబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిగెల్ లాంగ్‌ తొందరపడగా.. ఆఖరి... Read more

 • Sunil gavaskar does nt want rishabh pant to bat at no 4 for india

  నాలుగో స్థానంలో పంత్ వద్దన్న సునీల్ గవాస్కర్

  Aug 12 | భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని నాలుగో స్థానంలో ఇకపై ఆడించకపోవడమే మంచిదని దిగ్గజ క్రికెటర్ లిటిల్ మాస్టార్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం రాత్రి... Read more

 • Sourav ganguly hits out at bcci after notice to rahul dravid

  ది వాల్ కు నోటీసులు.. విరుచుకుపడ్డ దాదా, భజ్జీ..

  Aug 08 | విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేయడంపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ద్రవిడ్‌కే నోటీసులిచ్చారంటే భారత క్రికెట్‌ను... Read more

 • Gandi soch badlo irfan tweets on kashmir situation

  నా మనసు, హృదయం రెండూ మీతోనే: ఇర్ఫాన్ పఠాన్

  Aug 07 | దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లిన దాదాపు వందమందికిపైగా క్రికెటర్లను రెండు రోజుల క్రితం ప్రభుత్వం వెనక్కి పంపింది. జమ్మూకాశ్మీర్ లోని పర్యాటకులను, విద్యార్థులను పంపినట్టుగానే వీరిని అక్కడి నుంచి వెనక్కి పంపింది. పరిస్థితులు... Read more

Today on Telugu Wishesh