'Gandi soch badlo': Irfan tweets on Kashmir situation నా మనసు, హృదయం రెండూ మీతోనే: ఇర్ఫాన్ పఠాన్

Gandi soch badlo irfan tweets on kashmir situation

Amarnath Yatra, Article 370, Irfan Pathan, Jammu and Kashmir, JK Team mentor, JK Team player, dileep trophy, Article 35 A, Jammu and Kashmir Bifurcated, sport news, cricket news, sports, cricket

Former India all-rounder Irfan Pathan lashed out at people invoking religion and questioning the government’s motive, one of the 100 cricketers who was asked to leave the Valley at the earliest on 4 August amid prevailing security tensions.

నా మనసు, హృదయం రెండూ మీతోనే: ఇర్ఫాన్ పఠాన్

Posted: 08/07/2019 12:25 PM IST
Gandi soch badlo irfan tweets on kashmir situation

దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ వెళ్లిన దాదాపు వందమందికిపైగా క్రికెటర్లను రెండు రోజుల క్రితం ప్రభుత్వం వెనక్కి పంపింది. జమ్మూకాశ్మీర్ లోని పర్యాటకులను, విద్యార్థులను పంపినట్టుగానే వీరిని అక్కడి నుంచి వెనక్కి పంపింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండడంతో భద్రతా కారణాల రీత్యా వీరందరినీ వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కోరడంతో వీరంతా కశ్మీర్‌ను విడిచిపెట్టారు.

అలా వెనక్కి వచ్చిన వారిలో టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, కోచ్ మిలాప్ మేవడా, ట్రైనర్ సుదర్శన్ కూడా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఇర్ఫాన్ స్పందిస్తూ.. తన మనసు, హృదయం రెండూ కశ్మీరీలతోనే ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కశ్మీరీ సోదరులు, అక్కచెల్లెళ్ల కోసం అవి తపిస్తున్నాయని పేర్కొంటూ కశ్మీర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

జమ్ముకశ్మీర్ జట్టు ఆటగాడిగా, మెంటార్‌గా ఇర్ఫాన్ సేవలందిస్తున్నాడు. దులిప్ ట్రోఫీ కోసం జమ్మూకాశ్మీర్ కు వెళ్లిన ఆయనతో పాటు అనేక మంద్రి క్రీడాకారులు ప్రస్తుతం అక్కడ నెలకోన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి వచ్చేశారు.  కాగా, ఈ నెల 17 నుంచి  దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా అది ముగిసిన వెంటనే విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీలు జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amarnath Yatra  Article 370  Irfan Pathan  Jammu and Kashmir  Article 35 A  cricket  

Other Articles