Virat Kohli wishes 'happy retirement' to Dale Steyn దక్షిణాఫ్రికా స్పేస్ లెజెండ్ సంచలన నిర్ణయం

Dale steyn retires from tests as south africa s highest wicket taker

Virat Kohli, Dale Steyn, Dale Steyn retires, dale steyn good bye to test cricket, South Africa cricket, Royal Challengers Bangalore, cricket news, sports news, cricket, sports

Legendary fast bowler Dale Steyn brought the curtains down on his Test career on Monday and tributes started to pour in for the South African cricketer from all over the globe. India captain Virat Kohli was among the first ones to wish Steyn on social media.

దక్షిణాఫ్రికా స్పేస్ లెజెండ్ సంచలన నిర్ణయం

Posted: 08/07/2019 10:58 AM IST
Dale steyn retires from tests as south africa s highest wicket taker

దక్షిణాఫ్రికా పేస్ లెజెండ్ డేల్ స్టెయిన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా స్టెయిన్ మాట్లాడుతూ.. తనకెంతో ఇష్టమైన ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా ఉందన్నాడు. తాను మరో టెస్టు ఆడలేననే విషయం తనను బాధిస్తోందన్నాడు.

టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వన్డేలు, టీ20లలో ఎక్కువ కాలం ఆడేందుకు ప్రయత్నిస్తానని స్టెయిన్ పేర్కొన్నాడు. 2004లో ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన స్టెయిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో చివరి టెస్టు ఆడాడు. మొత్తం 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్లు తీసి 1251 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలున్నాయి.  

కాగా, టెస్టు క్రికెట్ ఆడే దేశాలపై ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టిన ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా స్టెయిన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్ నుంచి విరమణ తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్టెయిన్ కు హ్యాపీ రిటైర్మెంట్ అంటూ తన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే స్టెయిన్ ను పేస్ మిషీన్ తో పోల్చిన విరాట్.. హ్యాపీ రిటైర్మెంట్ టు సేస్ మిషన్ అంటూ ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles