MS Dhoni friend Arun Pandey clarifies MSD retirement ధోని విషయంలో స్పష్టతనిచ్చిన చిన్ననాటి మిత్రుడు

Ms dhoni has no plans to retire soon claims friend arun pandey

dhoni, dhoni retirement, ms dhoni, ms dhoni retirement, arun pandey, arun pandey ms dhoni, indian cricket team, sports news, cricket, sports

Mahendra Singh Dhoni has no plans to retire, claims his close friend and business partner Arun Pandey, adding that Team India desperately requires his services right now.

ధోని విషయంలో స్పష్టతనిచ్చిన చిన్ననాటి మిత్రుడు

Posted: 07/20/2019 01:27 PM IST
Ms dhoni has no plans to retire soon claims friend arun pandey

వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి నేపథ్యంలో అందరి దృష్టి మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ కొందరు, ధోనీ ఇప్పట్లో తప్పుకోడని మరికొందరు చెబుతుండడంతో, విండీస్ టూర్ కు ధోనీని ఎంపిక చేయాలో వద్దో తేల్చుకోలేక సెలెక్టర్లు సతమతం అవుతున్నారు. అయితే, ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై అతడి సన్నిహితుడు అరుణ్ పాండే చెబుతున్న వివరాలు సెలెక్టర్లకు పెద్దగా రుచించకపోవచ్చు అనిపించేలా ఉన్నాయి.

ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా.. ధోనీకి ఇప్పటికిప్పుడు రిటైరయ్యే ఆలోచనేదీ లేదని ధోని చిరకాల మిత్రుడు అరుణ్ పాండే స్పష్టం చేశారు. ధోనీ వంటి గొప్ప ఆటగాడి కెరీర్ పై అదేపనిగా ఊహాగానాలు వస్తుండడం దురదృష్టకరమని పాండే అభిప్రాయపడ్డారు. ధోనీ రిటైర్మెంటుపై పాండే వ్యాఖ్యలతో కాస్తంత స్పష్టత రావడంతో, ఇప్పుడతడిని విండీస్ టూర్ కు సెలెక్ట్ చేయడమా, వద్దా అనేది సెలెక్టర్ల చేతిలో ఉంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయంపైనే ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంది. కాగా, అరుణ్ పాండే వికెట్ కీపింగ్ దిగ్గజం ధోనీకి చాలాకాలంగా సన్నిహిత మిత్రుడు. ఇద్దరూ కలిసి అనేక వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ధోనీ ఆటలో బిజీగా ఉన్న నేపథ్యంలో, అతని తరఫున వ్యాపారాలు చూసుకునేది అరుణ్ పాండేనే. ఈ నేపథ్యంలో ధోనీ మనసులో మాటనే అరుణ్ పాండే బయటికి వెల్లడించినట్టు అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhoni retirement  ms dhoni  arun pandey  indian cricket team  sports news  cricket  sports  

Other Articles