Pant, Ziva Play New High-Pitched Game చిన్నారి జీవాతో కలిసి పంత్ అరుపులు..

Ziva dhoni and rishabh pant have a blast at india vs pakistan match

Rishabh Pant, Ziva Dhoni, India beat Pakistan, India vs Pakistan Score, India vs Pakistan World Cup Score, India vs Pakistan, India vs Pakistan Match Score, India vs Pakistan, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Rishabh Pant and Ziva Dhoni shared funny moments on Sunday as the two were seen shouting on the top of their voice during India's high-octane clash against Pakistan.

జీవా ధోనితో రిషబ్ పంత్ అరుపులు.. వీడియో వైరల్

Posted: 06/17/2019 08:46 PM IST
Ziva dhoni and rishabh pant have a blast at india vs pakistan match

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి జివా ప్రస్తుతం ప్రపంచ కప్‌ మ్యాచులను ఆస్వాదిస్తోంది. ‘కమాన్ పాపా’ అంటూ గ్యాలరీ నుంచి తండ్రిని ఉత్సాహపరుస్తోంది. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ జివా తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈసారి ఈ అల్లరి పిల్లకు రిషబ్ పంత్ తోడయ్యాడు. ఎడమచేయి బొటనవేలు గాయంతో జట్టు నుంచి వైదొలిగిన శిఖర్ ధావన్ స్థానంలో బ్యాకప్ ప్లేయర్ గా రిషబ్ పంత్ ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.

అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కు తుది జట్టులో పంత్‌కు స్థానం దక్కలేదు. దీంతో అతను వీఐపీ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ సమయంలో ధోనీ కూతురు జివాతో కలిసి అరుపులు, కేకలతో గోలగోల చేశాడు. తనతో జివా పోటాపోటీగా అరుస్తున్న వీడియోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘పార్ట్‌నర్స్ ఇన్ క్రైమ్’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, రిషబ్ పంత్‌ను ఇలా చూసిన నెటిజన్లు ‘బెస్ట్ బేబీసిట్టర్’ అంటూ కితాబిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ సమయంలో రిషబ్ పంత్‌ను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ స్లెడ్జింగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నారు. ‘వన్డే టీమ్‌లోకి ధోనీ వచ్చాడు.. మరి నువ్వేం చేస్తావ్.. నా ఇంట్లో బేబీ సిట్టింగ్ చేస్తావా’ అంటూ పంత్‌ను టిమ్ పైన్ రెచ్చగొట్టాడు. ఆ తర్వాత పైన్ భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫొటోను పంత్ షేర్ చేస్తూ.. ‘సరే మీ పిల్లలను నేను చూసుకుంటా.. నువ్వు భార్యతో సినిమాకు వెళ్లు’ అంటూ పంచ్ విసిరాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ గొడవను గుర్తు చేస్తూ నిజంగా పంత్ బెస్ట్ బేబీసిట్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
View this post on Instagram

Partners in crime

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • India seeks ravi shastri s replacement after world cup shock

  టీమిండియా ప్రధానకోచ్ కు బిసిసిఐ గట్టి షాక్..!

  Jul 16 | భారత క్రికెట్ జట్టుకు త్వరలో ప్రధాన కోచ్‌ మారనున్నాడు. ప్రస్తుతం రవిశాస్త్రి కోచ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కోచ్ తో పాటు సహాయ సిబ్బంది నియామకం కోసం త్వరలోనే బీసీసీఐ ఓ ప్రకటన... Read more

 • Five indians in sachin tendulkar s world cup xi no ms dhoni

  అయ్యో ధోని.. లెజెండ్ వరల్డ్ ఎలెవన్ లో నో ప్లేస్

  Jul 16 | క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన వరల్డ్ కప్ సంబరం ముగిసింది. న్యూజిలాండ్ జట్టుతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ... Read more

 • England win maiden world cup title after super over drama

  ప్రపంచ చాంపియన్‌ కల నెరవేరింది.. ఇంగ్లాండ్‌దే ప్రపంచకప్‌

  Jul 15 | ఇంగ్లండ్‌ కల నెరవేరింది. 44 ఏళ్ల వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆ దేశ జట్టు ఎట్టకేలకు వన్డే క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠతో సాగినదిగా పేర్కొనదగిన వరల్డ్‌... Read more

 • I ll tell you when i m their coach rohit sharma on advice to pakistan

  రోహిత్ టైమింగ్: సలహా అడిగితే చురకలంటించేడోచ్..

  Jun 17 | ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థిపై శతకం బాదిన రోహిత్‌శర్మ ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌కి తనదైనశైలిలో చురక అంటించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అనంతరం... Read more

 • Shoaib akhtar slams pakistan s sarfaraz ahmed for brainless captaincy

  ‘బుద్దిమాలిన కెప్టెన్’ అంటూ రావల్సిండి ఫైర్

  Jun 17 | వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఆసక్తి చూసినా.. ఎలాంటి ఉత్కంఠ లేకుండా.. మ్యాచ్ ఆద్యంతం ఏకపక్షంగానే సాగి విజయానికి వరుణుడు అడ్డుగా నిలిచినా.. డిఎల్ఎస్ ప్రకారం గెలుపు... Read more

Today on Telugu Wishesh