Shoaib Akhtar calls Sarfaraz Ahmed 'brainless captain' ‘బుద్దిమాలిన కెప్టెన్’ అంటూ రావల్సిండి ఫైర్

Shoaib akhtar slams pakistan s sarfaraz ahmed for brainless captaincy

world cup, world cup news, teamindia, india news, india cricket, india vs pakistan, shoaib akhtar, shoaib akhtar youtube, shoiab akhtar videos, sarfaraz ahmed, cricket, cricket news, sports news, latest sports news, sports

The Pakistani legend shoaib akhtar slams pakistan captain sarfaraz ahmed brainless captaincy and Clueless Management, after defeat to india in world cup 2019

‘బుద్దిమాలిన కెప్టెన్’ అంటూ రావల్సిండి ఫైర్

Posted: 06/17/2019 07:27 PM IST
Shoaib akhtar slams pakistan s sarfaraz ahmed for brainless captaincy

వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఆసక్తి చూసినా.. ఎలాంటి ఉత్కంఠ లేకుండా.. మ్యాచ్ ఆద్యంతం ఏకపక్షంగానే సాగి విజయానికి వరుణుడు అడ్డుగా నిలిచినా.. డిఎల్ఎస్ ప్రకారం గెలుపు టీమిండియాదేనని ప్రకటించింది ఐసిసి. ఎంతో అసక్తిని కలిగించిన మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై తనకు తిరుగులేదని మరోసారి చాటుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే సమయంలో పాక్ జట్టును తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై మాజీ విమర్శల బాణాలు ఎక్కుబెట్టారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవాలన్న సర్ఫరాజ్ నిర్ణయం పట్ల పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు. ఓ కెప్టెన్‌ ఏ మాత్రం బుర్ర లేకుండా ఇలా ఎలా ఉంటాడో నాకు అర్థం కావడం లేదు. లక్ష్య చేధనలో మెరుగైన ఆటతీరును కనబర్చలేమని సర్ఫరాజ్‌ ఆలోచించలేదా? వికెట్ పొడిగా ఉంది, మనం బలం బ్యాటింగ్ కాదు, బౌలింగ్ అని తెలీదా? అని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్తర్ సర్ఫరాజ్‌ను ఏకేశాడు.

మ్యాచ్‌లో టాస్ గెలవడం ఎంతో కీలకం, టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టే. కానీ సర్ఫరాజ్ మాత్రం ఫీల్డింగ్ ఎంచుకొని చేజేతులా మ్యాచ్‌ను ఓడించాడు. బుర్ర తక్కువ కెప్టెన్సీ, తెలివి తక్కువ మేనేజ్‌మెంట్ అని అక్తర్ ఘాటుగా విమర్శించాడు. ‘‘1999లో ఇంజమామ్, సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిదీ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్ ఉన్నప్పుడే 227 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయాం. ఇప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం ద్వారా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. కానీ పాక్ కెప్టెన్ మాత్రం బుర్ర వాడలేద’’ని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ విమర్శలు గుప్పించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles