Kedar Jadhav declared fit for World Cup టీమిండియా ప్రపంచకప్ జట్టులోకి కేదర్ జాదవ్..

Kedar jadhav declared fit for 2019 world cup to travel to england

Kedar Jadhav, Team India, 2019 World Cup, Chennai Super Kings, IPL 2019, cricket, cricket news, sports news, latest sports news, sports

Team India recieved a major boost on Saturday as middle-order batsman Kedar Jadhav was declared fit and is set to travel with the squad to England for the upcoming 2019 World Cup.

టీమిండియా ప్రపంచకప్ జట్టులోకి కేదర్ జాదవ్..

Posted: 05/18/2019 06:05 PM IST
Kedar jadhav declared fit for 2019 world cup to travel to england

ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో అతడు మైదానంలో విలవిల్లాడాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు కోలుకోవడంపై అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వీటన్నింటికీ టీమిండియా ఫిజియో పాట్రిక్‌ ఫర్హార్ట్‌ తెర దించారు. గురువారం జాదవ్‌కి ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించి అతను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు.

మే 22న ప్రపంచకప్‌కు మిగతా జట్టు సభ్యులందరితో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లడానికి జాదవ్‌ సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా జాదవ్‌ కీలకం కానున్నాడు. బ్యాటుతోనే కాకుండా బౌలింగ్‌ పరంగానే జట్టుకు జాదవ్‌ ముఖ్యమే. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున మంచి ప్రదర్శనే చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kedar Jadhav  Team India  2019 World Cup  Chennai Super Kings  IPL 2019  cricket  

Other Articles