Anil Kumble reveals his Best IPL XI అనీల్ కుంబ్లే బెస్ట్ ఐపీఎల్ జట్టులో ధోనికే పగ్గాలు..

Anil kumble picks his best xi for the season big name misses out

IPL 2019 Final, Anil Kumble, Kumble IPL XI, IPL 2019, Kumble IPL Team, Virat Kohli, Shreays Iyer, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news, sports, latest sports news, cricket

Former India leg-spinner Anil Kumble picked his IPL XI ahead of the big final between Chennai Super Kings and Mumbai Indians at Hyderabad. Kumble, surprisingly left out RCB captain Virat Kohli from his IPL XI and instead went in with Delhi Capitals leader Shreyas Iyer.

అనీల్ కుంబ్లే బెస్ట్ ఐపీఎల్ జట్టులో ధోనికే పగ్గాలు..

Posted: 05/11/2019 09:36 PM IST
Anil kumble picks his best xi for the season big name misses out

ఐపీఎల్‌ ఫైనల్‌ పోరుకు ముందు భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన 2019 ఉత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ధోనీని కెప్టెన్సీ పగ్గాలను అందించిన ఈ క్రికెటర్ ఆశ్చర్యకరంగా రాజస్థాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్ కు జట్టులో స్థానం కల్పించాడు. టీమిండియా జట్టులో ధోనీ, రాహుల్, పాండ్య, బుమ్రా మినహా మరెవరికీ అవకాశం ఇవ్వని మాజీ కోచ్ ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ కు కూడా ఈ జట్టులో చోటు కల్పించారు. తన జట్టులో ఆటగాళ్ల ఎంపికపై కుంబ్లే వివరణ ఇచ్చాడు.

కుంబ్లే జట్టు సభ్యులను ఎంపికపై వివరణ ఇస్తూ ‘శ్రేయస్‌ అయ్యర్‌ను ఎందుకు తీసుకున్నానంటే.. అతను సత్తా ఉన్న ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్ లో రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ్యత తీసుకొని బ్యాటింగ్‌ చేస్తాడు. ఢిల్లీ పిచ్‌ బ్యాటింగ్ కు అనుకూలించదు. అయినా, శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేసి చూపించాడు. 16 మ్యాచుల్లో  463 పరుగులు చేశాడు’ అని కుంబ్లే తెలిపాడు. సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ను తీకున్నప్పటికీ మరో ఓపెనర్‌ బెయిర్‌స్టోకు అవకాశం ఇవ్వలేదు. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు.

దీనిపై వివరణ ఇస్తూ.. ‘వార్నర్‌, బెయిర్‌ స్టో ఇద్దరూ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్లే‌. నేను కూడా బెయిర్‌స్టోను తీసుకోవాలని అనుకున్నా. కానీ, జట్టు సమతూకం కోసం రాహుల్ ను ఎంచుకున్నాను’ అని తెలిపాడు. మిడిల్‌ ఆర్డర్లో హార్దిక్‌ పాండ్య, రసెల్ కు కచ్చితంగా చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే.. ఈ సీజన్ లో టీ20 క్రికెట్ కు అర్థం చెప్పింది వాళ్లిద్దరే అన్నాడు. అయితే, రాజస్థాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్ కు జట్టులో స్థానం కల్పించడంపై మాత్రం వివరణ ఇవ్వలేదు.

కుంబ్లే ప్రకటించిన 2019 ఐపీఎల్‌ జట్టు..
ధోనీ(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ వార్నర్‌, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అండ్రూ రసెల్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, కగిసో రబాడా, జస్ప్రీత్‌ బుమ్రా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles