SRH coach Cries Profusely After Loss కన్నీళ్లు పెట్టుకున్న టామ్ మూడీ.. భావోద్వేగంలోకి హైదరాబాదీ..!

Tom moody crying after srh s show in ipl match makes fans emotional

Tom Moody, David Warner, Delhi Capitals, Indian Premier League,IPL,IPL 2019,Jonny Bairstow,Kagiso Rabada,Kane Williamson,Shreyas Iyer,Sports,SRH vs DC,Sunrisers Hyderbad, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

SunRisers Hyderabad (SRH) coach Tom Moody could not control his tears and broke down publically after his team was knocked out of IPL by Delhi Capitals (DC).

కన్నీళ్లు పెట్టుకున్న టామ్ మూడీ.. భావోద్వేగంలోకి హైదరాబాదీ..!

Posted: 05/09/2019 11:25 PM IST
Tom moody crying after srh s show in ipl match makes fans emotional

గెలుపు అంచుల వరకు వెళ్లిన మ్యాచ్.. కళ్లముందే చేజారిపోతుండటంతో అభిమానులకే ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే ఇది అభిమానులకు మాత్రమే పరిమితం అనుకుంటే పోరబాటే.. జట్టును వెన్నంటి వుండి ప్రోత్సహించే తెరవెనుకనున్న వారు ఏమాత్రం అతీతం కాదు. గెలుపు తీరం చేరిన సందర్భంలో ఒక్కసారిగా మ్యాచ్ గతి మారిపోయేసరికి సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రధాన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారిపోయింది. ఆయన వీడియో చూసిన హైదరాబాదీ అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

ఢిల్లీ గెలవాలంటే 18 బంతుల్లో 34 పరుగులు కావాలి. అప్పటికే వరుసగా వికెట్లు పడుతుండటంతో సన్‌ రైజర్స్‌దే విజయం అనుకున్నారంతా. కానీ థంపీ వేసిన 18వ ఓవర్లో ఢీల్లీ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ వరుసగా 4, 6, 4, 6 బాదేశాడు. ఆ ఓవర్‌ ముగిసిన తర్వాత సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులుగా మారింది. దీంతో మ్యాచ్‌ ఢీల్లీవైపు మొగ్గింది. రిషభ్‌ పంత్‌ (49) చెలరేగడంతో ఇంకో బంతి మిగిలి ఉండగానే ఢీల్లీ విజయం సాధించింది. దీంతో సన్‌ రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించకతప్పలేదు. ఈ మ్యాచులో సన్‌ రైజర్స్‌ ఓడిపోవటంతో జట్టు కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

18వ ఓవర్‌ వేస్తున్న సమయంలో మ్యాచ్‌ చేజారిపోతున్న విషయాన్ని గ్రహించిన కోచ్‌ టామ్‌ మూడీ కన్నీళ్లు పెట్టాకున్నారు. మరోవైపు మైదానంలో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సైతం కొంత బావోద్వేగానికి గురైనట్లు కనిపించాడు. అయితే, దీనికి సబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు ఐపీఎల్‌లో తన జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్‌ మూడీ.. ఈ మ్యాచులో ఇదే చేదు సంఘటన.. క్రికెట్‌ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇదో భావోద్వేగం అని పేర్కొంటున్నారు. సన్‌ రైజర్స్‌ టైటిల్‌ గెలవకపోవచ్చు. కానీ, అందరి మనసు గెలిచింది అంటూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles