Australian cricketer jailed for five years అత్యాచారం కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు

Alex hepburn cricketer jailed for five years for rape of woman

Alex Hepburn, Rape, Cricket rape, Worcestershire, Hereford Crown Court, Joe Clarke, Alex Hepburn rape case, Cricket Australia, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

An Australian-born cricketer who raped a woman he found "dozing" in his teammate's bedroom was jailed for five years by an English court. Alex Hepburn, was convicted following an attack that took place during the first night of a sexual conquest "game".

అత్యాచారం కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్‌కు ఐదేళ్ల జైలు

Posted: 05/01/2019 05:03 PM IST
Alex hepburn cricketer jailed for five years for rape of woman

ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా నిద్రిస్తున్న సహచరుడి ప్రియురాలిపై అత్యాచారం చేసిన ఆస్ట్రేలియన్‌ యువ క్రికెటర్‌కు ఇంగ్లండ్‌ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు...ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్‌ హెప్‌బర్న్‌(23) 2017లో ఇంగ్లండ్‌లోని  వార్చెస్టెర్‌షేర్‌ కౌంటీ క్రికెట్ క్లబ్‌ తరపున ఆడుతున్నాడు. ఓ రోజు తన సహచర ఆటగాడు జో క్లార్క్‌ ఓ అమ్మాయిని తన గదికి తీసుకువచ్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో అలెక్స్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు హెర్ఫోర్డ్‌ క్రౌన్‌ కోర్టులో రెండేళ్లుగా విచారణ జరుగుతోంది.

తాను నిద్రపోతుండగా అలెక్స్‌ తనపై అత్యాచారం చేశాడని, తొలుత తాను తన ప్రియుడు జో క్లార్క్‌ అనుకున్నానని, గొంతు గుర్తుపట్టిన తర్వాతే అది అలెక్స్‌ అని అర్థమయిందని కోర్టులో విచారణ సందర్భంగా బాధితురాలు తెలిపింది. అయితే ఆమె తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని అలెక్స్‌ కోర్టుకు చెబుతూ వచ్చాడు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు అలెక్స్‌ తప్పుడు వాదన చేస్తున్నాడని నిర్థారించి ఈ మేరకు తీర్పు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alex Hepburn  Joe Clarke  Alex Hepburn rape case  Cricket Australia  sports  cricket  

Other Articles