James Faulkner clarifies he’s not gay నిజంగా నేను మగాడినే: అసీస్ ఓపెనర్ జేమ్స్ ఫాల్కనర్

James faulkner s bizarre instagram post sparks social media backlash

Australia Isreal Folau, Who is Israel Folau, Australia cricket Israle Folau JAmes Faulkner, James Faulkner Israel Folau cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Australian cricketer James Faulkner clarified that he was not gay on Tuesday after a post about his “boyfriend” on social media was widely interpreted as a landmark coming-out statement.

నిజంగా నేను మగాడినే: అసీస్ ఓపెనర్ జేమ్స్ ఫాల్కనర్

Posted: 04/30/2019 08:01 PM IST
James faulkner s bizarre instagram post sparks social media backlash

ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ తాను మగాడినే నమ్మండంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నాడు. ఔనా.. ఎందుకిలా చెప్పాల్సివస్తుందంటే.. ఆయన సరదాగా చేసిన పనే ఆయనకీ తిప్పలు పెట్టింది. సోషల్ మీడియాలో తన మిత్రుడిపై ప్రేమను ఒలకబోసి.. తీరా అది కాస్తా వికటించే సరికి ఇలా అభ్యర్థించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడం ఒక ఎత్తు అయితే దానికింద రాసే కామెంట్లలో కాసింత జాగ్రత్త వహించకపోతే ఇలాంటి తిప్పలు ఎవరైనా ఎధురుకునే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇదో జాడ్యం అలుముకుంది

స్వలింగ సంపర్కం చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఈ రోజుల్లో మరి ముందుజాగ్రత్త తీసుకుని వుంటే జేమ్స్ ఫాల్కనర్ ఇన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చేదీ కాదు.. తాను మగాడినే అంటూ అభ్యర్థించాల్సి వచ్చేది కాదు. అసలేం జరిగిందంటే... ఏప్రిల్ 29 సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి జరుపుకుంటున్నానని పోస్టు చేశాడు. అంతే డిన్నర్ విత్ బాయ్ ఫ్రెండ్ అని పోస్టు చేయడంతో పాటు కలిసి ఓ ఐదేళ్ల నుంచి ఉంటున్నాం(టు గెదర్ ఫర్ ఫైవ్ ఇయర్స్)అని ట్వీట్ చేశాడు. దానికి నెటిజన్లతో పాటు అభిమానులు కూడా ఫాల్కనర్‌ను అపార్థం చేసుకున్నారు.

ఆస్ట్రేలియా ఫేసర్‌పై తీవ్రంగా విమర్శలు కురిశాయి.  ఆ పోస్టుకు స్సందించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాన్ టైట్, డేవిడ్ వార్నర్, బ్రెట్ లీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోస్టు చూసిన వాళ్లంతా తనను అపార్థం చేసుకుంటుండటంపై వివరణ ఇచ్చుకున్నాడు. 'నేను గే కాదు.. అందరూ పోస్టు గురించి అపార్థం చేసుకుంటున్నారు. ఎల్బీజీటీ కమ్యూనిటీ అద్భుతమైన సహకారం అందింది. ఆదరణ ఎప్పటికీ ఆదరణే. అతను కేవలం ఐదేళ్లుగా నా రూమ్మేట్.. బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఇది కేవలం సరదాకి చేసిన పోస్టు అంతే' అని వివరణ ఇచ్చుకున్నాడు.

 
 
 
View this post on Instagram

Birthday dinner with the boyfriend (best mate!!!) @robjubbsta and my mother @roslyn_carol_faulkner #togetherfor5years

A post shared by James Faulkner (@jfaulkner44) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia Isreal Folau  James Faulkner  James Faulkner Israel Folau  Australia  sports  cricket  

Other Articles