MS Dhoni gave us a massive scare: Virat Kohli ధోని బ్యాటింగ్ తో భయపెట్టాడంటున్న విరాట్ కోహ్లీ

Ms dhoni did what he does best give us a massive scare virat kohli

ipl 2019, ms dhoni massive scare, virat kohli, rcb vs csk, kohli dhoni 84, rcb vs csk highlights, dhoni ipl 2019, dhoni rcb vs csk ipl 2019 highlights, dhoni kohli massive scare, dhoni virat kohli reaction, chennai super kings, royal challengers bangalore, ipl 2019 news, ipl 2019 videoscricket, cricket news, sports news, latest sports news, sports

IPL 2019, RCB vs CSK: MS Dhoni's career-best score of 84 not out went in vain as Royal Challengers Bangalore clinched a 1-run win over Chennai Super Kings on Sunday. Dhoni hit 24 runs in the final over but it was still not enough for the visitors to clinch two points.

ధోని బ్యాటింగ్ తో భయపెట్టాడంటున్న విరాట్ కోహ్లీ

Posted: 04/22/2019 08:03 PM IST
Ms dhoni did what he does best give us a massive scare virat kohli

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సారి పేలవ ప్రదర్శనను కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్రితం రోజు రాత్రి కూడా మ్యాచ్ ను చేజార్చుకుంది అని భావించినా.. చివరి బంతి ట్విస్ట్ నేపథ్యంలో మళ్లీ ప్లే ఆఫ్ వైపు పయనించేందుకు ఆశలు చిగురించాయి. అయితే ఇదే దూకుడు కనబరిస్తే తప్ప.. చివరి వరకు ప్రయత్నించాల్సిన అవసరం వుందని అభిమానులు కోరుతున్నారు. అయితే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మాత్రం మ్యాచ్ చివరి ఓటర్ చేరుకునేవరకు టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చూసి భయమేసిందని తెలిపాడు.

చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఆ ఓవర్లో కావలసిన 26పరుగులు పూర్తి చేస్తాడేమోననిపించింది. 48 బంతుల్లో 84పరుగులు చేసిన ధోనీ.. ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. 'స్పల్ప వ్యత్యాసంతో మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. చాలా అవకాశాలను వదిలేసుకున్నాం. మహీ మాత్రం తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మేమంతా అతని బ్యాటింగ్‌కు భయపడిపోయాం. చివర్లో మాత్రం ఊహించిందే జరిగింది'

'లీగ్‌లో ముగిసిన  తొమ్మిది మ్యాచులలో కొన్ని సార్లు బ్యాటింగ్, కొన్ని సార్లు బౌలింగ్ చేస్తున్నా.. గెలుస్తామన్న నమ్మకం తమలో తమకేలేక చేజార్చుకున్నామని విరాట్ కోహ్లీ చెప్పాడు. మ్యాచ్ చివరికి వచ్చే సరికి ఇక తమ ఓటమి తప్పదని నిర్ణయించుకోవడంతేనే పలు మ్యాచ్ లు ఓడిపోయామని అన్నారు. ఈ మ్యాచ్‌లోనూ ధోనీ అంతటి పనే చేశాడని అన్నారు. 19ఓవర్ల వరకూ బాగా ఆడి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలనుకుంటే మహీ ఎదురుదాడి మమ్మల్ని భయానికి గురిచేసింది.. అయితే చివరి బంతి పూర్తైయ్యేవరకు తమలోని నమ్మకాన్ని సన్నగిల్లవద్దని వారిని ఉత్తేజపరుస్తూనే వున్నానని, అదే నిజమై చివరి బంతి విజయాన్ని అందించిందని కోహ్లీ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles