BCCI ombudsman fines Pandya, Rahul for Koffee fiasco హార్ధిక్ పటేల్, రాహుల్ లకు రూ.20 లక్షల జరిమానా..!

Hardik pandya kl rahul fined rs 20 lakh each by bcci for inappropriate remarks

world cup 2019, Koffee with Karan, kl rahul, ipl 2019, Hardik Pandya, bcci ombudsman, D.K. Jain, bcci, cricket, cricket news, sports news, latest sports news, sports

India cricket team all-rounder Hardik Pandya and opener KL Rahul have been fined Rs 20 lakh each by the Board of Control for Cricket in India (BCCI) for their sexist remarks on popular TV chat show ‘Koffee with Karan’

హార్ధిక్ పటేల్, రాహుల్ లకు రూ.20 లక్షల జరిమానా..!

Posted: 04/20/2019 05:14 PM IST
Hardik pandya kl rahul fined rs 20 lakh each by bcci for inappropriate remarks

భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కి చెరో రూ. 20 లక్షలు జరిమానా పడింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ అంబుడ్స్ మెన్‌ డీకే జైన్ ప్రకటించారు. గత ఏడాది ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి హాజరైన ఈ ఇద్దరు క్రికెటర్లు నోరుజారి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. రిజర్వ్ ఓపెనర్ ‌గా కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యాని జట్టులోకి ఎంపిక చేశారు భారత సెలక్టర్లు.

ఈ ఇద్దరు క్రికెటర్లు చెల్లించే రూ. 20 లక్షల జరిమానాలో.. రూ.10 లక్షల్ని పారా మిలిటరీ ఫోర్స్‌లో వీరమరణం పొందిన కానిస్టేబుల్స్ భార్యలకి, మిగిలిన రూ. 10 లక్షల్ని అంధుల క్రికెట్ అసోసియేషన్ కి విరాళంగా ఇవ్వాలని బీసీసీఐ అంబుడ్స్ మెన్ సూచించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాలలోపు ఇద్దరు క్రికెటర్లు చెల్లించాలని కూడా అతను ఆదేశించాడు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే గత జనవరిలో రాహుల్, హార్దిక్ పాండ్యాపై కొద్దిరోజులు నిషేధం విధించిన నేపథ్యంలో.. వారిపై ఇక ఎలాంటి చర్యలు ఉండబోవని బీసీసీఐ అంబుడ్స్‌మెన్ స్పష్టం చేశారు.

అసలు ఏం జరిగిందంటే..? బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకి గత ఏడాది ఆఖర్లో హాజరైన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్.. అక్కడ జోహార్ సరదాగా అడిగిన ప్రశ్నలకి కొంటెగా సమాధానం చెప్పి చిక్కుల్లో పడ్డారు. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని చూసే విధానంపైనా హార్దిక్ పాండ్య అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కేఎల్ రాహుల్.. తన జేబులో కండోమ్ ప్యాకెట్ ఉండటం, అది తన తండ్రి చూసి ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావంటూ ప్రశంసించినట్లు చెప్పడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : world cup 2019  Koffee with Karan  kl rahul  ipl 2019  Hardik Pandya  bcci ombudsman  bcci  cricket  

Other Articles