IPL trophy is never too far, says Shreyas Iyer టైటిల్ సాధించే సత్తా ఢిల్లీకి వుందన్న కెప్టెన్

Believe we can win ipl 2019 delhi capitals captain shreyas iyer

Delhi Capitals, Shreyas Iyer, IPL 2019, SRH vs DC, Sunrisers Hyderabad, India Premier League, IPL 2019 points table, Kagiso Rabada, Kane Williamson, cricket, cricket news, sports news, latest sports news, sports

Having jumped to the second spot after beating Sunrisers Hyderabad by 39 runs, Delhi Capitals captain Shreyas Iyer Sunday said that his team is believing it can win the IPL title this time.

టైటిల్ సాధించే సత్తా ఢిల్లీకి వుందన్న కెప్టెన్

Posted: 04/15/2019 05:47 PM IST
Believe we can win ipl 2019 delhi capitals captain shreyas iyer

ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరు మార్చుకోగానే రాత కూడా మారిందని నిరూపిస్తోంది. గతంలో కంటే అనూహ్యంగా పుంజుకొని టాప్‌ గేర్ లో దూసుకెళుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్బంగా ఢిల్లీ క్యాపిటల్ సారధి శ్రేయస్ అయ్యార్ మాట్లాడుతూ.. తమ  జట్టు ఈ సారి టైటిల్‌ కొట్టేందుకు సిద్ధంగా ఉందని, ఆ సామర్థ్యం జట్టుకు ఉందని అన్నాడు.

ప్రణాళికబద్దంగా అన్నీ జరిగితే ఛాంపియన్ గా నిలవడానికి ఎంతో దూరంలో లేము అని పేర్కొన్నాడు. మునుపటితో పోల్చుకుంటే మా జట్టు ఆటగాళ్లు పుంజుకున్నారు. కీలకమైన భాగస్వామ్యాలు జట్టు విజయాలను నిర్ణయిస్తాయి. పంత్ తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడంపై దృష్టి పెడుతున్నానని అన్నాడు. పెద్ద భాగస్వామ్యాలు విజయాలు అందిస్తాయని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మంది ఒకే వయసున్న వాళ్లుకావడంతో వారి మధ్య అవగాహన కూడా త్వరగానే కుదురుతుందని చెప్పుకోచ్చాడు.

అండర్‌-19 క్రికెట్ లోనూ కలిసి ఆడిన అనుభవం ఉంది. కీలక బౌలర్ గా మారిన రబాడా కూడా మాతో ఎంతో క్రికెట్‌ ఆడాడు. కాబట్టి మా మధ్య సమన్వయ భారం ఎక్కువగా ఉండద’న్నాడు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకూ ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ విషయంలోనూ +0.418తో అందరికంటే ముందుంది. మరో మూడు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం మెరుగవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Capitals  Shreyas Iyer  IPL 2019  SRH vs DC  IPL 2019 points table  cricket  

Other Articles

Today on Telugu Wishesh