Kuldeep Yadav opens up about tips by MS Dhoni మ్యాచ్ లో ధోని ఇచ్చే సలహాలపై కుల్దీప్ ఏమన్నాడంటే..

Kuldeep yadav says dhoni knows everything about a batsman opens up about tips during matches

India vs Australia ODI,india national cricket team,ind vs aus odi,Ind vs Aus live score,Ind vs Aus,Australia national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Kuldeep Yadav opened up about the tips and advice MS Dhoni gives during matches while praising the veteran wicketkeeper-batsman. Kuldeep even said "it’s a lot of fun playing with Mahi bhai."

మ్యాచ్ లో ధోని ఇచ్చే సలహాలపై కుల్దీప్ ఏమన్నాడంటే..

Posted: 03/09/2019 08:25 PM IST
Kuldeep yadav says dhoni knows everything about a batsman opens up about tips during matches

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఇచ్చే టిప్స్ మ్యాచ్‌లో తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో ఉస్మాన్ ఖవాజా (104) -అరోన్ ఫించ్ (93) ఓపెనింగ్ జోడీ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు భారత్ తీవ్రంగా శ్రమిస్తున్న వేళ.. ఇన్నింగ్స్ 32వ ఓవర్‌ వేసిన కుల్దీప్ యాదవ్‌ తెలివైన బంతితో ఫలితం రాబట్టాడు.

ధోనీ సూచనల మేరకు మిడిల్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని కుల్దీప్ బంతి విసరగా.. ఫించ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ మణికట్టు స్పిన్నర్ 64 పరుగులిచ్చినా.. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

మ్యాచ్ సమయంలో ధోనీ సలహాలు, సూచనలు గురించి తాజాగా కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ ‘మహేంద్రసింగ్‌ ధోనీతో కలిసి ఆడటం చాలా సరదాగా ఉంటుంది. మ్యాచ్‌ సమయంలో అతను కొన్ని సూచనలు చేస్తుంటాడు. అయితే.. అవి కొన్నిసార్లు మంచి ఫలితాన్నిస్తాయి. మరికొన్నిసార్లు విఫలమవ్వచ్చు. కానీ.. ధోనీపై ఉన్న గౌరవం మాత్రం తగ్గదు. అతనికి అన్నీ తెలుసు. ఒక్కోసారి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ గురించి చిన్న విషయాలు కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ.. ధోనీకి మాత్రం తెలుసుంటాయి’ అని వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో వన్డే మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  ODI Series  Team India  MS Dhoni  Kuldeep yadav  Virat Kohli  sports  cricket  

Other Articles

 • Twitter left in splits as shoaib malik clatters his own stumps

  నెట్టింట్లో షోయబ్ మాలిక్ ట్రోల్.. గుడ్ హిట్.. వికెట్..!

  May 18 | పాకిస్థాన్‌ జట్టు సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో షోయబ్ ఔటయిన విధానమే ఇందుకు కారణం. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో... Read more

 • Kedar jadhav declared fit for 2019 world cup to travel to england

  టీమిండియా ప్రపంచకప్ జట్టులోకి కేదర్ జాదవ్..

  May 18 | ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా ఆటగాడు కేదార్ జాదవ్‌ గాయం నుంచి కోలుకున్నాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా జాదవ్‌ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పి తీవ్రం కావడంతో అతడు మైదానంలో విలవిల్లాడాడు.... Read more

 • Harbhajan singh wants to see ms dhoni slaughter bowlers at icc world cup 2019

  ప్రపంచకప్ లో ధోని విధ్వంసమే.. స్వేచ్ఛనివ్వండీ..!

  May 18 | టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి ప్రపంచకప్‌లో వీలైనంత స్వేచ్ఛ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ క్రికెట్ ప్లేయర్ హర్భజన్‌ సింగ్‌.  టీమిండియాలో ఫోర్త్ డౌన్‌లో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్న దానిపై క్రికెట్... Read more

 • Icc cricket world cup 2019 ganguly predicts india pakistan outcome

  వరల్డ్ కప్ ఫైనల్స్ ఆ రెండు జట్ల మధ్యే: సౌరవ్ గంగూలీ

  May 15 | 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌‌ను ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీ... Read more

 • Icc cricket world cup 2019 virat kohli defends picking dinesh karthik over rishabh pant

  పంత్ స్థానంలో దినేశ్ కార్తీక్.. ఎందుకంటే..

  May 15 | ఐపీఎల్ లో మంచి ఫామ్ లో వున్న ఇండియన్ వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి తోడుగా ప్రపంచ కప్ లో టీమిండియా రెండో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్... Read more

Today on Telugu Wishesh