Chris Gayle hints at a U-turn on ODI retirement రిటర్మెంట్ నిర్ణయంపై గేల్ యుటార్న్

Chris gayle first player to smash 500 sixes in international cricket

India vs Australia ODI,india national cricket team,ind vs aus odi,Ind vs Aus live score,Ind vs Aus,Australia national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

West Indies vs England 4th ODI: Chris Gayle etched his name in the record books by smashing 14 sixes to take his tally of sixes to 506 in international cricket. Chris Gayle smashed 162 and also completed 10,000 runs in ODIs.

500 సిక్సర్లతో.. చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్..

Posted: 02/28/2019 08:52 PM IST
Chris gayle first player to smash 500 sixes in international cricket

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయి తన అంతర్జాతీయ క్రికెట్‌లో మైలురాయిని దాటేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన 4వ వన్డే మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా 135, 50, 162 పరుగులు సాధించిన క్రిస్ గేల్.. బుధవారం సెయింట్ జార్జ్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలోనూ చెలరేగిపోయాడు. కేవలం 97 బంతుల్లో 162 పరుగులు సాధించాడు.

ఈ మ్యాచ్‌లో గేల్ 14 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. ఈ 14 సిక్సులతో కలుపుకుని ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ బాదిన సిక్సుల సంఖ్య 506కు చేరింది. 39 ఏళ్ల గేల్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 500సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రీది రికార్డును సైతం తుడిచిపెట్టేశాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీ నమోదు చేసి వన్డే కెరీర్లో 25వ సెంచరీ చేయగలిగాడు. దాంతో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ఈ ఘనతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మోసేస్తూ.. ట్వీట్ చేసింది. 'గేల్ పాజీ.. నువ్వు గ్రేట్' అని పేర్కొంది. 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న గేల్.. ఈ జాబితాలో రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అగ్రస్థానంలో బ్రియాన్ లారా (10,405) ఉండగా ఈ ఘనత సాధించిన 14వ క్రికెటర్‌గా గేల్ (10,074) నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles