Dravid helped me a lot, says KL Rahul కెఎల్ రాహుల్ ను సానబట్టినది ఎవరో తెలుసా.?

Time spent with dravid helped me a lot says kl rahul

Rahul Dravid, kl rahul, India vs Australia, india national cricket team, Hardik Pandya, Australia vs India, australia, cricket, cricket news, sports news, latest sports news, sports

KL Rahul has maintained a stoic silence after his show with Karan Johar, said I spent a lot of time with Rahul Dravid, working on my game and chatting about cricket. He helped me a lot in the games I played."

కెఎల్ రాహుల్ ను సానబట్టినది ఎవరో తెలుసా.?

Posted: 02/28/2019 07:29 PM IST
Time spent with dravid helped me a lot says kl rahul

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్ ను సొంతగడ్డపై ఆస్ట్నేలియాతో ఆడించడం వృథా అనే భావించారంతా.. జట్టు కూర్పుపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, ఫిబ్రవరి 24 ఆదివారం జరిగిన మ్యాచలో 35బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్, రెండో టీ20 ఫిబ్రవరి 27న అదే స్థాయిలో అదరగొట్టాడు.

26బంతుల్లో 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అసలు ఈ గ్యాప్ లో రాహుల్ ఏం చేశాడు. వివాదాల్లోకి ఇరుక్కుని బయటకు వచ్చిన రాహుల్‌.. తిరిగి ఫామ్ ఎలా దక్కించుకున్నాడని ఆలోచిస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత రాహుల్ ను టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కకు పెట్టేసింది. ఇండియా ఏ జట్టుకు అప్పగించింది. ఆ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెట్ ద్రవిడ్.. కేఎల్ రాహుల్ ను సాన బెట్టాడు. తిరిగి ఫామ్ దక్కేలా చేశాడు. రెండు అనధికారిక టెస్టులకు ఇండియా ఏ జట్టులో ఆడి వరుసగా 89, 81 పరుగులు చేయడంతో టీమిండియాలోకి మళ్లీ పిలుపొచ్చింది.

'ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరామం రాగానే భారత్ కు వచ్చేశా. నా ఆటలో లోపాలను సరిచేసుకున్నా. అదృష్టవశాత్తు ఇండియా ఏ గేమ్స్ అందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఒత్తిడి తక్కువ ఉండటంతో నా నైపుణ్యాలపై ఫోకస్ చేయడం సాధ్యపడింది. రాహుల్ ద్రవిడ్‌తో చాలా సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ లో ఆడడం బాగా కలిసొచ్చింది' అని రాహుల్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఆస్ట్ర్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్.. తొలి సిరీస్ అయిన టీ20ని 0-2తో కోల్పోయింది. మార్చి2 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆడి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Dravid  kl rahul  india national cricket team  Hardik Pandya  cricket  

Other Articles