Sharma claims record as India cruise past New Zealand రోహిత్ శర్మ రికార్డుల వేట.. సాగిందిలా..!

Rohit sharma breaks several records in auckland t20i

India vs New Zealand, ind vs nz t20, Ind vs Nz score, Ind vs NZ, India vs New Zealand, T20 Series, Team India, Rohit Sharma, Martin Guptill, 100 T20I sixes, chris gayle, MS Dhoni, Krunal Pandya, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India's stand-in skipper Rohit Sharma in the second T20I against New Zealand at Auckland. Not only did he break a world record that was previously held by a Kiwi batsman but he also broke several other records during his knock at Eden Park.

రోహిత్ శర్మ రికార్డుల వేట.. సాగిందిలా..!

Posted: 02/08/2019 07:15 PM IST
Rohit sharma breaks several records in auckland t20i

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2288 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో గప్తిల్, షోయబ్ మాలిక్, విరాట్ కోహ్లీ, బ్రెండన్ మెకల్లమ్‌లు నిలిచారు. 2272 పరుగులో గప్తిల్ రెండో స్థానంలో నిలవగా, 2263 పరుగులతో షోయబ్ మాలిక్, 2167 పరుగులతో విరాట్ కోహ్లీ, 2140 పరుగులతో బ్రెండన్ మెకల్లమ్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
 
ఇక, టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు. తాజా అర్ధ సెంచరీతో 20 సార్లు ఆ ఘనత సాధించి ఈ జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 19 అర్ధ సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో నిలవగా, 16 అర్ధ సెంచరీలతో మార్టిన్ గప్తిల్, 15 అర్ధ సెంచరీలతో క్రిస్‌గేల్, మెకల్లమ్, 14 హాఫ్ సెంచరీలతో తిలక్‌రత్నే దిల్షాన్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  T20 Series  Team India  Rohit Sharma  Martin Guptill  sports  cricket  

Other Articles