MS Dhoni's average in successful ODI chases soars కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

103 and counting ms dhoni s average in successful odi chases soars

India vs Australia ODI, india national cricket team,ind vs aus odi,Ind vs Aus live score,Ind vs Aus,Australia national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, chasing rate, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India’s batting order often under criticism with dwindling returns of the last two years, MS Dhoni was on Friday named Man of the Series for three consecutive half-centuries in a famous 2-1 ODI series win over Australia.

కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

Posted: 01/18/2019 07:13 PM IST
103 and counting ms dhoni s average in successful odi chases soars

టీమిండియా దిగ్గజం ధోనీ...ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో హాట్ టాపిక్ గా మారాడు. హ్యాట్రిక్ అర్థశతకాలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ గా చిరిత్రపుటల్లోకి ఎక్కిన ధోని... అస్ట్రేలియా గడ్డపై జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ తో తన సత్తా ఏంటో మరోసారి చేటాడు. మ్యాన్ ఆప్ ద సిరీస్ గా నిలవడం మాత్రమే కాదు చేజింగ్ లో సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు.

వన్డే చేజింగ్ లో ఏకంగా కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డునే బ్రేక్ చేశాడు. అసీస్ తో జరిగిన తొలి వన్డేలో అర్థశతకంతో రాణించినా.. విమర్శకుల నోళ్లను మూయించ లేకపోయాడు. అడిలైడ్ వన్డేలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంతో విమర్శలకు బ్రేక్ పడింది. ఇక మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చిరస్మర విజయాన్ని అందించడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో చేజింగ్లో ధోనీ సగటు 103.47కి చేరింది. లక్ష్య చేధనలో వన్డే ఫార్మాట్లో ఇదే అత్యుత్తమ సగటు.

చేజింగ్ జాబితాలో ఇప్పటివరకూ అగ్రస్థానంలో వున్న విరాట్ కొహ్లీని అధిగమించాడు. కొహ్లీ సగటు 97.98. తనదైన స్టైల్‌లో దూకుడుగా ఆడలేకపోయినా.. బాద్యతాయుతంగా ఆడి భారత్‌ను గెలిపించాడు. కెప్టెన్ విరాట్‌తో కలిసి ధోనీ జట్టుకు విలువైన భాగస్వామ్యాన్నందించాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఔటైనా మహీ క్రీజ్‌లో పాతుకుపోయాడు. కేదార్ జాదవ్‌తో కలిసి జట్టును లక్ష్యానికి మరింత చేరువ చేశాడు ధోనీ. 74 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటాడు. వన్డేల్లో ధోనీకి ఇది 70 అర్ధ సెంచరీ. 116 బంతుల్లో 87 పరుగులు చేసి భారత జట్టును గెలిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  ODI Series  Team India  Virat Kohli  MS Dhoni  chasing rate  sports  cricket  

Other Articles