Yuzvendra Chahal hits Aussies with a 'six' అసీస్ ను కంగారుపెట్టిన చాహాల్ స్పీన్ జాలం

Yuzvendra chahal s 6 wickets help india bundle out australia for 230

Yuzvendra Chahal, India vs Australia, Melbourne, Cricket, Australia vs India, australia, cricket, cricket news, sports news, latest sports news, sports

Yuzvendra Chahal on Friday bamboozled Australia with his leg-spin, taking career-best 6/42 as India dismissed the hosts for 230 in 48.4 overs in the third and deciding ODI of the three-match series in Melbourne.

అసీస్ ను కంగారుపెట్టిన చాహాల్ స్పీన్ జాలం

Posted: 01/18/2019 05:23 PM IST
Yuzvendra chahal s 6 wickets help india bundle out australia for 230

మెల్ బోర్న్ వేదికగా జ‌రుగిన మూడో వ‌న్డేలో స్పిన్నార్ చావ‌ల్ మాయాజాలం దెబ్బ‌కు ఆసిస్ విలవిలలాడింది. తమ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేకపోయింది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ బంతులకు కంగారుపడ్డ అసీస్ 48.4 ఓవర్లకే చేతులెత్తేసింది. ఓవైపు నుంచి చాహాల్ ఆసీస్ లైనప్ ను దెబ్బతీస్తూ 6 వికెట్లు సాధించిన వేళ, మరోవైపు నుంచి భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ రెచ్చిపోయారు.

టీమిండియా పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ ధాటికి ఓపెన‌ర్లు కారే (5), ఫించ్ (14) స్వ‌ల్ప స్కోర్లకే అవుట‌య్యారు. 27 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్ష్‌, ఖ‌వాజా ఆదుకున్నారు. వీరిద్ద‌రూ మూడో వికెట్‌కు 73 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్లో మొదటి బంతినే హిట్ చేసేందుకు షాన్ మార్ష్ (39: 54 బంతుల్లో 3×4) క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. చాహల్ తెలివిగా బంతిని వైడ్ రూపంలో లెగ్ సైడ్ విసరగా.. దాన్ని చాకచక్యంగా అందుకున్న ధోనీ స్టంపౌట్ చేశాడు.

అదే ఓవర్ లో నాలుగో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఉస్మాన్ ఖవాజా (34: 51 బంతుల్లో 2×4) చాహల్ కే సులువైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. చాహ‌ల్ ధాటికి ఖ‌వాజా (34), షాన్ మార్ష్ (39), హండ్స్‌కాంబ్ (58), స్టోయిన్స్ (10), రిచ‌ర్డ్స‌న్ (16), జంపా (8) పెవిలియ‌న్ చేరారు. కెరీర్‌లో మొద‌టి సారి ఆరు వికెట్లు ద‌క్కించుకుని చాహ‌ల్ స‌త్తా చాటాడు. మ్యాక్స్‌వెల్ (26), స్టాన్‌లేక్ (0) వికెట్ల‌ను ష‌మీ తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో ఆస్ట్రేలియా మ‌రో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే 48.4 ఓవ‌ర్ల‌లో 230 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో హాండ్స్‌కాంబ్ (58) మాత్ర‌మే అర్ధ‌శ‌త‌కం సాధించాడు. మిగిలిన వారిలో షాన్ మార్ష్ (39), ఖ‌వాజా (34) చెప్పుకోద‌గ్గ ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ ఆరు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ష‌మీ, భువీ రెండేసి వికెట్లు ద‌క్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yuzvendra Chahal  India vs Australia  Melbourne  TeamIndia  australia  cricket  

Other Articles