Rohit Sharma's brilliant hundred goes in vain సిడ్నీ వన్డే: టీమిండియాపై 34 పరుగులతో అసీస్ విజయం

India vs australia hosts win by 34 runs take 1 0 lead in three match series

Aaron Finch, Australia, Australia vs India 2018-19, Ind vs Aus, TeamIndia, India vs Australia, India vs Australia sydney ODI Score, Virat Kohli, Rohit Sharma, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Rohit Sharma's individual brilliance was not enough to make up for a floundering top and middle order as India suffered a 34-run defeat at the hands of a resilient Australia in the first One-day International.

తొలి వన్డేలో 34 రన్స్ తో అసీస్ విజయం.. రో‘హిట్’ సెంచరీ వృధా

Posted: 01/12/2019 05:54 PM IST
India vs australia hosts win by 34 runs take 1 0 lead in three match series

ఆస్ట్రేలియాకి సొంతగడ్డపై టెస్టులో ఓటమి రుచిచూపిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌ని మాత్రం ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10x4, 6x6) శతకం బాదినా.. టీమిండియాకి 34 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ‌తో పాటు మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3x4, 1x6) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఆఖరికి భారత్ 254/9కే పరిమితమైంది.

దీంతో.. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 నుంచి జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. హ్యాండ్స్‌కబ్ (73: 61 బంతుల్లో 6x4, 2x6), ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6x4), షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4x4) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/66), కుల్దీప్ యాదవ్ (2/54) ఫర్వాలేదనిపించారు.

289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ - మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోవడంతో భారత్ ఒకానొక దశలో 140/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.

కానీ.. జట్టు స్కోరు 141 వద్ద ధోనీ ఔటవగా.. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (12), రవీంద్ర జడేజా (8) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో 46వ ఓవర్ వరకూ పోరాడిన రోహిత్ శర్మ.. కెరీర్‌లో 22వ శతకం పూర్తి చేసుకుని జట్టు స్కోరు 221 వద్ద ఔటయ్యాడు. దీంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (29 నాటౌట్: 23 బంతుల్లో 4x4) బ్యాట్ ఝళిపించి ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు.

భారత్ వన్డే జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కబ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెరెండ్రాఫ్, పీటర్ సిడిల్, నాథన్ లయన్, రిచర్డ్‌సన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ind vs Aus  Aaron Finch  Virat Kohli  Rohit Sharma  MS Dhoni  Sydney ODI  sports  cricket  

Other Articles