MSD fifth player to score 10,000 ODI runs పదివేల పరుగుల మైలురాయిని అధిగమిచిన ధోని

Ms dhoni becomes fifth indian to breach 10000 run mark in odis

ms dhoni, dhoni, mahendra singh dhoni odi, ms dhoni odi runs, dhoni odi runs, india vs australia, ind vs aus, india vs australia 1st odi, ind vs aus 1st odi, cricket, cricket news, sports news, latest sports news, sports

MS Dhoni joined the elite list of Indian cricketers who had previously done so, which include Sachin Tendulkar, Sourav Ganguly, Rahul Dravid and Virat Kohli.

పదివేల పరుగుల మైలురాయిని అధిగమిచిన ధోని

Posted: 01/12/2019 05:02 PM IST
Ms dhoni becomes fifth indian to breach 10000 run mark in odis

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భారత్ తరఫున వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్క్వేర్ లెగ్ దిశగా సింగిల్ తీసి ఈ మైలురాయిని అందుకున్నాడు. 334వ వన్డే ఆడుతున్న ధోనీ.. భారత్ తరఫున పదివేల పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత్ తరఫున ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), విరాట్ కోహ్లీ (10,235) 10 వేల పరుగులు మైలురాయిని అందుకున్నారు.

వాస్తవానికి గత ఏడాది జూలైలోనే మహేంద్రసింగ్ ధోని పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కానీ.. అందులో 174 పరుగులు ఆసియా ఎలెవన్ తరఫున చేశాడు. 2007లో ఆఫ్రికా ఎలెవన్, ఆసియా ఎలెవన్ మధ్య జరిగిన ఆ టోర్నీలో.. మూడు వన్డేలాడిన ధోనీ 174 పరుగులు చేశాడు.

గతేడాది స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో ధోనీ ఈ ఫీట్‌ను అందుకోవాల్సింది. కానీ విండీస్‌తో మూడు వన్డేల్లో మాత్రమే మహీకి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ సిరీస్‌లో మహీ 20, 7, 23 చొప్పున మాత్రమే రన్స్ చేశాడు. తిరువనంతపురం వేదికగా నవంబర్ 1న జరిగిన చివరి వన్డేలో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. దీంతో భారత గడ్డపై పూర్తి చేయాల్సిన పది వేల పరుగులను ఆస్ట్రేలియాలో పూర్తి చేశాడు. 72 రోజుల నిరీక్షణ, 9100 కి.మీ. ప్రయాణం (త్రివేండ్రం-సిడ్నీ)అనంతరం ధోనీ ఈ ఫీట్ సాధించాడన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  10000 runs club  india vs australia  sydney test  sports  ind vs aus 1st odi  cricket  

Other Articles

 • 103 and counting ms dhoni s average in successful odi chases soars

  కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

  Jan 18 | టీమిండియా దిగ్గజం ధోనీ...ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో హాట్ టాపిక్ గా మారాడు. హ్యాట్రిక్ అర్థశతకాలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ గా చిరిత్రపుటల్లోకి ఎక్కిన... Read more

 • Chahal and dhoni script historic series triumph against australia

  చరిత్ర సృష్టించిన టీమిండియా.. అసీస్ గడ్డపై తొలివన్డే సిరీస్

  Jan 18 | అస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడవ,... Read more

 • Yuzvendra chahal s 6 wickets help india bundle out australia for 230

  అసీస్ ను కంగారుపెట్టిన చాహాల్ స్పీన్ జాలం

  Jan 18 | మెల్ బోర్న్ వేదికగా జ‌రుగిన మూడో వ‌న్డేలో స్పిన్నార్ చావ‌ల్ మాయాజాలం దెబ్బ‌కు ఆసిస్ విలవిలలాడింది. తమ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేకపోయింది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్... Read more

 • French players crash press conference to celebrate world cup triumph

  ముచ్చటగా మూడోసారి: భువికి ఫించ్ హ్యాట్రిక్ వికెట్

  Jan 18 | ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌పై ఆఖరి వన్డేలోనూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యం కొనసాగింది. తాజా పర్యటనలో ఆ గడ్డపై ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు... Read more

 • Ms dhoni wrongly given out in a controversial manner at sydney

  తప్పుడు నిర్ణయం.. ధోని చెప్పినా వినని అంఫైర్

  Jan 12 | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్‌లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో... Read more

Today on Telugu Wishesh