Kohli beats Sachin record to reach 19000 runs కోహ్లీ ఖాతాలో మరో ఘనత.. సచిన్ రికార్డు బద్దలు

India vs australia virat kohli breaks yet another sachin tendulkar record in sydney

Virat Kohli, Sachin Tendulkar, 19000 runs, INDvsAUS, India tour of Australia 2018, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian captain Virat Kohli broke yet another Sachin Tendulkar record as he became the fastest batsman to reach 19,000 international runs.

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత.. సచిన్ రికార్డు బద్దలు

Posted: 01/03/2019 06:40 PM IST
India vs australia virat kohli breaks yet another sachin tendulkar record in sydney

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఘనతల పుస్తకంలో మరోటి వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 19,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్‌ తెందుల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ 23 పరుగులు చేశాడు. దీంతో అతడు 19,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కేవలం 399 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించడం ప్రత్యేకం.

అంతకు ముందు సచిన్‌ తెందుల్కర్‌ 432 ఇన్నింగ్సుల్లో 19,000 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రయన్‌ లారా (433), ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ (444), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్‌ కలీస్‌ (458) టాప్‌-5లో ఉన్నారు. నాలుగేళ్లుగా విరాట్‌ అప్రతిహతంగా పరుగులు చేస్తున్నాడు. శతకాలతో చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ఇలా కఠిన ప్రత్యర్థులపై వారి సొంతగడ్డలోనే శతకాలు సాధిస్తున్నాడు. ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కీర్తి పెంచుకుంటున్నాడు.

గతేడాది విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 2,735 పరుగులు చేశాడు. అందులో 11 శతకాలు ఉన్నాయి. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, బౌలర్‌ ఎవరన్నది చూడకుండా అత్యుత్తమ టెక్నిక్‌తో టన్నుల కొద్దీ విరాట్‌ పరుగులు చేస్తున్నాడు. అత్యంత వేగంగా 18,000 పరుగులు చేసిన ఘనత సైతం అతడి పేరుతోనే ఉంది. 382 ఇన్నింగ్సుల్లో గతేడాది సెప్టెంబర్‌లో ఈ రికార్డు సాధించాడు. చూడబోతుంటే సచిన్‌ రికార్డులన్నీ విరాట్‌ బద్దలు కొట్టేలా ఉన్నాడని క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Sachin Tendulkar  19000 runs  INDvsAUS  India tour of Australia 2018  sports  cricket  

Other Articles

  • 103 and counting ms dhoni s average in successful odi chases soars

    కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

    Jan 18 | టీమిండియా దిగ్గజం ధోనీ...ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో హాట్ టాపిక్ గా మారాడు. హ్యాట్రిక్ అర్థశతకాలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ గా చిరిత్రపుటల్లోకి ఎక్కిన... Read more

  • Chahal and dhoni script historic series triumph against australia

    చరిత్ర సృష్టించిన టీమిండియా.. అసీస్ గడ్డపై తొలివన్డే సిరీస్

    Jan 18 | అస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడవ,... Read more

  • Yuzvendra chahal s 6 wickets help india bundle out australia for 230

    అసీస్ ను కంగారుపెట్టిన చాహాల్ స్పీన్ జాలం

    Jan 18 | మెల్ బోర్న్ వేదికగా జ‌రుగిన మూడో వ‌న్డేలో స్పిన్నార్ చావ‌ల్ మాయాజాలం దెబ్బ‌కు ఆసిస్ విలవిలలాడింది. తమ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేకపోయింది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్... Read more

  • French players crash press conference to celebrate world cup triumph

    ముచ్చటగా మూడోసారి: భువికి ఫించ్ హ్యాట్రిక్ వికెట్

    Jan 18 | ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌పై ఆఖరి వన్డేలోనూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యం కొనసాగింది. తాజా పర్యటనలో ఆ గడ్డపై ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు... Read more

  • Ms dhoni wrongly given out in a controversial manner at sydney

    తప్పుడు నిర్ణయం.. ధోని చెప్పినా వినని అంఫైర్

    Jan 12 | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్‌లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో... Read more

Today on Telugu Wishesh