Virat Kohli surpasses Rahul Dravid to top elite list 16ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన కోహ్లీ

India vs australia virat kohli surpasses rahul dravid to top this elite list

virat kohli, rahul dravid's record, Rahul Dravid, most runs in a calendar year, Melbourne Test, India vs Australia, Ind vs Aus 3rd test, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian skipper Virat Kohli surpassed Rahul Dravid to become the Indian batsman with most overseas runs in a calendar year.

16ఏళ్ల నాటి రికార్డును తిరగరాసిన కోహ్లీ

Posted: 12/27/2018 04:16 PM IST
India vs australia virat kohli surpasses rahul dravid to top this elite list

ఆస్ట్రేలియా గడ్డపై నిలకడగా ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. సుమారుగా 16 ఏళ్ల నాటి రికార్డును తన పేరున తిరగరాసుకున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటైన విరాట్ కోహ్లీ.. కొద్దిలో శతకాన్ని మిస్ అయినా.. తన ఖాతాలోకి మాత్రం మరో రికార్డును మాత్రం వేసుకున్నాడు. ఒక ఏడాదిలో విదేశీ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు.

2002లో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 1,137 పరుగులతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పగా.. తాజాగా విరాట్ కోహ్లీ 1,138 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అయితే.. ద్రవిడ్ అప్పట్లో కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. కోహ్లీ మాత్రం 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్‌ని చేరుకోవడం విశేషం. 2002లో విదేశీ గడ్డపై పరుగుల వరద పారించిన రాహుల్ ద్రవిడ్.. 66.88 సగటుతో ఏకంగా 4 శతకాలు, 4 అర్ధశతకాలతో మెరిశాడు. ఆ ఏడాది విదేశాల్లో 11 టెస్టులాడిన ద్రవిడ్ 18 ఇన్నింగ్స్‌ల్లో 1,137 పరుగులు చేశాడు.

మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో శతకాల మోత మోగించిన విరాట్ కోహ్లీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. గత వారం పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో శతకం సాధించిన కోహ్లీ.. తాజాగా మెల్‌బోర్న్‌లోనూ 82 పరుగులు చేయడం ద్వారా సిరీస్‌లో 259 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ ఇప్పటికే (టెస్టుల్లో) దక్షిణాఫ్రికా గడ్డపై 286, ఇంగ్లాండ్‌ గడ్డపై 593 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

That slow mate that can't keep up with you between wickets

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Rahul Dravid  Melbourne Test  Ind vs Aus  most run in calender year  sports  cricket  

Other Articles