Cheteshwar Pujara bags another record చతేశ్వర్ పుజారా ఖాతాలో అరుదైన రికార్డు..

Cheteshwar pujara joins sunil gavaskar facing 200 balls for third time in a series

Cheteshwar Pujara, India vs Australia, Sunil Gavaskar, Rahul dravid, vvs laxman, sachin tendulkar, sports news,sports, latest sports news, cricket news, cricket

TeamIndia new wall Cheteshwar Pujara bags another record into his career, joins Sunil Gavaskar facing 200 balls for third time in a series. Former Aussie quick Mitchell Johnson calling him a Test run-machine.

చతేశ్వర్ పుజారా ఖాతాలో అరుదైన రికార్డు..

Posted: 12/26/2018 08:09 PM IST
Cheteshwar pujara joins sunil gavaskar facing 200 balls for third time in a series

నాలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ ప్రారంభమైన మూడవ, బాక్సింగ్ డే టెస్ట్ లో చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడాడు. తనదైన శైలీ ఆటతో వికెట్ కాపాడుకుంటూ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 246 బంతుల్లో 123 పరుగులు, అదే మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 204 బంతుల్లో 71 పరుగులు చేశాడు.

ఇక రెండో టెస్ట్ మ్యాచులో మాత్రం పుజారా తన బ్యాటుతో అకట్టుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ప్రస్తుతం మెల్‌ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మాత్రం పుజారా మరోసారి తన బ్యాట్‌కి పని చెప్పాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 200 బంతుల్లో 68 పరుగులు చేశాడు. దీంతో ఈ సిరీస్ లో మూడు ఇన్నింగ్స్ లో 200 బంతులకు పైగా ఎదుర్కోన్న క్రికెటర్ గా నిలిచాడు.
 
ఈ క్రమంలో పుజారా తన ఖాతాలో అరుదైన ఘనతను వేసుకున్నాడు. ఒక సిరీస్‌ లో మూడు సార్లు 200లకు పైగా బంతులు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో పుజారా చేరాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఉన్నారు. 1977/78 మధ్య జరిగిన ఓ టెస్ట్ సిరీస్‌లో గవాస్కర్ ఈ ఫీట్ సాధించారు. గవాస్కర్ తర్వాతి స్థానంలో పుజారా నిలిచాడు. ఈ సందర్భంగా పుజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheteshwar Pujara  India vs Australia  Sunil Gavaskar  Cricket  sports  

Other Articles