Kohli can manage the distractions: Kumble టీమిండియా కెప్టెన్ పై మండిపడ్డ మాజీ కోచ్

India should open with agarwal and vihari at the mcg anil kumble

virat kohli, Melbourne Test, India vs Australia 3rd Test, India vs Australia, Ind vs Aus 3rd test, anil kumble, Ajinkya Rahane, cricket, cricket news, sports news, latest sports news, sports

Former India captain and coach Anil Kumble reflects on the options in front of the think-tank as they attempt to hit back after the loss in Perth that allowed Australia to level the series 1-1.

టీమిండియా కెప్టెన్ పై మండిపడ్డ మాజీ కోచ్

Posted: 12/24/2018 07:52 PM IST
India should open with agarwal and vihari at the mcg anil kumble

ఆస్ట్రేలియా గడ్డపై స్పిన్నర్ లేకుండానే టీమిండియా తుది జట్టుని ఎంచుకోవడంపై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మండిపడ్డాడు. గత వారం పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో.. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో భారత్ జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. కానీ.. రెండో రోజుకే బ్యాట్స్ మెన్ పాదముద్రల కారణంగా పిచ్‌ గరుకుగా మారిపోయి స్పిన్నర్లకి అతిగా సహకరించడం మొదలెట్టింది.

దీంతో.. వికెట్ల పండగ చేసుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’‌గా నిలిచాడు. దీంతో.. స్పిన్నర్ లేకుండా తుది జట్టుని ఎంచుకుని టీమిండియా పొరపాటు చేసినట్లు స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో తాజాగా మాట్లాడిన అనిల్ కుంబ్లే.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కి కూడా మొట్టికాయలు వేశాడు.

‘నేను టీమిండియాకి ఆడుతున్న రోజుల్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేయడమే కాకుండా.. స్పిన్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకునేవారు. ముఖ్యంగా.. సచిన్ అయితే.. అప్పుడప్పుడు ప్రొఫెషనల్ స్పిన్నర్ తరహాలో వికెట్లు కూడా పడగొట్టేవాడు. కానీ.. పెర్త్ టెస్టులో టీమ్‌ని చూస్తే.. హనుమ విహారి తప్ప స్పిన్ బౌలింగ్ వేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు నాకు కనిపించలేదు. అతను కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్. అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ తుది జట్టులో కనీసం ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్‌కి కూడా చోటివ్వకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Melbourne Test  India vs Australia  anil kumble  Ajinkya Rahane  cricket  

Other Articles