Australia beat India by 146 runs in perth test పెర్త్ టెస్టు: 146 పరుగులతో అసీస్ విజయం

India vs australia 2nd test australia beat india by 146 runs level series 1 1

india national cricket team, ind vs aus, Ind vs Aus score, Ind vs Aus, Australia vs India, Australia national cricket team, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India lost the second Test match against Australia by 146 runs at Perth. Chasing a target for 287 runs, India were bundled out for 140 runs leveling the series 1-1

చేతులెత్తేసిన విరాట్ సేన.. 146 పరుగులతో అసీస్ విజయం

Posted: 12/18/2018 04:28 PM IST
India vs australia 2nd test australia beat india by 146 runs level series 1 1

ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో తడబడింది. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 146 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపొందింది. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో ఐదో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే కుప్పకూలిపోయింది. రిషబ్ పంత్ (30: 61 బంతుల్లో 2x4), అజింక్య రహానె (30: 47 బంతుల్లో 2x4) టాప్ స్కోరర్‌గా నిలిచారు.

తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. ఇక మూడో టెస్టు మ్యాచ్‌ ఈనెల 26 నుంచి మొల్‌బోర్న్ వేదికగా జరగనుంది. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (123: 257 బంతుల్లో 13x4, 1x6) శతకం సాధించినా.. మ్యాచ్‌ గెలవలేకపోవడం గమనార్హం.అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా శతకం సాధించడంతో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Australia  perth test  virat kohli  Tim Paine  sports  cricket  

Other Articles