Cricket world erupts over no-ball controversy అంఫైర్ ఫెయిల్: 12 నోబాల్స్ వేసిన లంక స్పిన్నర్

Lakshan sandakan overstepping came from trying too hard

sri lanka vs england 3rd test, Sri Lanka vs England, sri lanka, Lakshan Sandakan, england, Colombo Test, cricket, cricket news, sports news, latest sports news, sports

Lakshan Sandakan had Ben Stokes’ number in the third Test match in Colombo, getting the English batsman out twice.But the celebrations were short-lived as Stokes twice returned to the crease when replays showed Sadakan had overstepped.

అంఫైర్ ఫెయిల్: 12 నోబాల్స్ వేసిన లంక స్పిన్నర్

Posted: 11/26/2018 08:14 PM IST
Lakshan sandakan overstepping came from trying too hard

కొలంబో వేదికగా ఇంగ్లాండ్‌ తో ముగిసిన మూడో టెస్టు మ్యాచులో శ్రీలంక స్పిన్నర్ లక్షణ్ సందకన్ బౌలింగ్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచులో 42 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకోగా.. ఆతిథ్య శ్రీలంక నోబాల్స్ కారణంగా అభాసుపాలైంది.
ఆటలో నాలుగో రోజైన సోమవారం తొలి సెషన్‌లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన సందకన్.. ఏకంగా 12 బంతుల్ని నోబాల్‌గా విసిరాడు.

అయితే.. ఇందులో కేవలం రెండు బంతుల్ని మాత్రమే అంపైర్లు నోబాల్‌గా గుర్తించారు. ఈ రెండు బంతుల్లోనూ ఒక బంతికి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఔటయ్యాడు. సందకన్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్ లక్ష్మల్.. అతనితో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. మొత్తంగా ఇవాళ్టి తొలి సెషన్లో సందకన్ వేసిన ఐదు ఓవర్లని పరిశీలించిన ‘మ్యాచ్ ప్రసార ఛానల్’ 40% బంతులు నోబాల్స్ అని గుర్తించింది.

మొత్తంగా ఆయన వేసిన ఐదు ఓవర్లలో.. 12 బంతుల్ని అతను నోబాల్ గా వేసినట్లుగా వెలుగులోకి తెచ్చింది. ఇందులో రెండు బంతులు అంటే.. 6% మాత్రమే అంపైర్లు గుర్తించగలిగారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ నోబాల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొలంబో వేదికగా శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెయిర్‌స్టో (110: 186 బంతుల్లో 9x4, 1x6) శతకం బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు 240 పరుగులకే కుప్పకూలిపోగా.. ఇంగ్లాండ్‌కి 96 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్ జట్టు 230 పరుగులకి ఆలౌటవగా.. శ్రీలంక ముందు 327 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే.. ఈ భారీ లక్ష్య ఛేదనని 82/5తో పేలవ రీతిలో ఆరంభించిన లంక.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేకపోయింది. ఆఖరికి ఆ జట్టు 284 పరుగులకి ఆలౌటైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri lanka  england  3rd test  Lakshan Sandakan  Colombo Test  cricket  

Other Articles

 • Icc t20i rankings kuldeep yadav rises to career best second india lose points

  ఐసిసి టీ-20 ర్యాకింగ్స్: రెండవ స్థానంలో కుల్దీప్ యాదవ్

  Feb 11 | ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి. బౌలింగ్‌ విభాగంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌... Read more

 • Imagine there is no ms dhoni icc recreates john lennon s classic

  ఎంఎస్ ధోనిపై మరోమారు ఐసీసీ ప్రశంసలు

  Feb 11 | టీమిండియా దిగ్గజం ధోనీపై మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన అభిమానాన్ని చాటుకుంది.  ఈ మిస్టర్ కూల్.. వికెట్ కీపర్ పట్ల ధోనీకి ఐసీసీ కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది. ఈ మధ్య ఐసీసీ చేసే... Read more

 • Parthiv patel won against yuvraj singh this week on instagram

  యువరాజ్ పై నెగ్గిన పార్థివ్ పటేల్.. ఎలాగో తెలుసా.?

  Feb 08 | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్-కీపర్ పార్థివ్ పటేల్ ఆన్‌లైన్‌లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుని అభిమానులకు బోల్డంత విందు అందిస్తుంటారు. ఈ సెటైర్లలో చాలాసార్లు యువరాజ్‌దే పైచేయి అవుతూ ఉంటుంది. అయితే, ఈసారి... Read more

 • Rohit sharma breaks several records in auckland t20i

  రోహిత్ శర్మ రికార్డుల వేట.. సాగిందిలా..!

  Feb 08 | టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) చేసిన రోహిత్... Read more

 • India vs new zealand 2nd t20i highlights india beat new zealand by 7 wickets

  రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ 1-1తో సమం..

  Feb 08 | తొలి టీ20లో అత్యధిక పరుగుల తేడాతో పరాజయం పాలైన రోహిత్ సేన తాజాగా ఇవాళ జరిగిన రెండో టీ20లో కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ పై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన... Read more

Today on Telugu Wishesh