ICC ODI rankings: Virat Kohli, Jasprit Bumrah in top 10 విరాట్ కోహ్లీ, రోహిత్ లు కింగులే

Icc odi rankings virat kohli solidifies top spot after reaching 10 000 club

icc odi rankings, icc odi team rankings, icc odi batsmen rankings, icc odi bowler rankings, cricket rankings, India, England, virat kohli, rohit sharma, jasprit bumrah, ambati rayudu, chahal, latest cricket rankings, cricket news, sports news, sports, cricket

The updated rankings see Virat Kohli further strengthen his hold over the top position in the batsmen rankings after reaching 10,000 ODI runs in the series against West Indies.

ఐసీసీ వన్డే ర్యాంకులు: విరాట్ కోహ్లీ, రోహిత్ లు కింగులే

Posted: 11/02/2018 09:40 PM IST
Icc odi rankings virat kohli solidifies top spot after reaching 10 000 club

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మళ్లీ కింగ్ గా నిలిచాడు వన్డే క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కోహ్లీ(899 పాయింట్లతో) తన అగ్రస్థానంలోనే కొనసాగుతూ సత్తాచాటాడు. కోహ్లీ ఈ ఏడాది 14వన్డే మ్యాచులాడి మొత్తం 1202పరుగులు సాధించాడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్లో మూడు శతకాలతో మొత్తం 453పరుగులు సాధించాడు.

మరోవైపు ఇదే విండీస్‌ సిరీస్‌లో రెండు శతకాలతో దూకుడు కొనసాగించిన వైస్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(871పాయింట్లతో) కూడా తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ ఉన్నాడు. టెస్టుల్లోనూ కోహ్లీనే అగ్రస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సిరీస్లో నామమాత్ర ప్రదర్శన చేసిన భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(767పాయింట్లతో) మాత్రం నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు 24స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్‌లో తొలిసారిగా 48 ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

బౌలర్ల విషయానికొస్తే పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(841పాయింట్లతో) తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో అఫ్గానిస్థాన్‌ స్పిన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌(788పాయింట్లు), మూడో స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌(723పాయింట్లు) కొనసాగుతున్నారు. అయితే మరో భారత స్పిన్నర్‌ చాహల్(683), ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌(683)తో కలిసి సమానంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో మాత్రం వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్‌(126పాయింట్లతో) మొదటి స్థానంలో ఉండగా, భారత్‌(121) రెండో స్థానంలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc odi rankings  India  England  virat kohli  rohit sharma  jasprit bumrah  cricket  

Other Articles

 • Watch gambhir infuriated after umpire gives him out

  వామ్మో.. అంపైర్ ‘ఔట్’ నిర్ణయంపై గంభీర్ ఆగ్రహం..!

  Nov 12 | భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మైదానంలో మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించి విమర్శలు ఎదుర్కొన్నాడు. మైదానంలో గంభీర్ అసహనం వ్యక్తం చేయడం, కోపాన్ని ప్రదర్శించడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ లో... Read more

 • Mithali raj surpasses rohit sharma to become leading run getter

  రోహిత్ శర్మ రిక్డార్డ్ బ్రేక్ చేసిన మిథాలీ రాజ్

  Nov 12 | భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుని ఆదివారం రాత్రి బద్దలుకొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వెస్టిండీస్‌ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన... Read more

 • Dhawan hails rishabh pant after thrilling win over wi

  రిషబ్ పంత్ పై శిఖర్ ధావన్ ప్రశంసలు..

  Nov 12 | చెన్నె వేదికగా జరిగిన టీ20 చివరి మ్యాచ్ లో టీమిండియా జట్టు రసవత్తరమై పోరులో విజయం సాధించిన తరువాత భారత వికెట్ కీపర్, యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్... Read more

 • We wanted to be ruthless skipper rohit sharma

  విండీస్ పై మా వ్యూహం ఫలించింది: రోహిత్

  Nov 12 | చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ముప్పేటదాడి చేయాలని టీమిండియా ముందే నిర్ణయించుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 181... Read more

 • Virat kohli reacted to crowd chanting anushka sharma s name

  కోహ్లీ ‘థంబ్స్‌ అప్‌’కు ముంబై అభిమానులు ఫిదా

  Oct 31 | అతిథ్య జట్టు విండీస్ తో వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ముంబైలోని స్టేడియంలో నాలుగో శతకాన్ని నమోదు చేసి శ్రీలంక అటగాడు కుమార సంగక్కర రికార్డును... Read more

Today on Telugu Wishesh