"It's never too early to start" - Mithali Raj మరో వైులురాయికి అడుగుదూరంలో కోహ్లీ

Virat kohli on the cusp of joining in elite 10 000 odi runs club

India vs West Indies, virat kohli, sourav ganguly, sachin tendulkar, Mahendra Singh Dhoni, india national cricket team, Brian Lara, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian cricket captain Virat Kohli is on the cusp of adding another feather to his illustrious cap, Who is all set to become just the fifth Indian batsman and 13th overall to score 10,000 runs in ODIs.

మరో వైులురాయికి అడుగుదూరంలో కోహ్లీ

Posted: 10/18/2018 06:43 PM IST
Virat kohli on the cusp of joining in elite 10 000 odi runs club

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను అందుకునేందుకు అడుగుదూరంలో వున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు క్రిడాకారులు మాత్రమే సాధించిన అరుదైన ఫీటును ఆయన సాధించేందుకు సిద్దమవుతున్నారు. ఈ చారిత్రక రికార్డుకి అందుకునేందుకు కోహ్లీ కేవలం అడుగు దూరంలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఐదు వన్డేల సిరీస్ లో కోహ్లి అ రికార్డును కూడా అందుకోనున్నాడు.

ఈ రికార్డును అందుకునేందుకు కోహ్లీ కేవలం 221 పరుగులు సాధించి తన ఖాతాలో వేసుకుంటే చాలు. రికార్డు తనంతట తాను కోహ్లీ వద్దకు నడుచుకుంటూ వచ్చేస్తుంది. 221 పరుగుల వద్ద ఏముంది అంటే.. వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో భారత క్రికెటర్ గా రికార్డుల్లో నిలవనున్నాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు ఐదుగరు బ్యాట్స్ మెన్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ ఫీటును విరాట్ సాధించడంతో వారి సరసన స్థానం లభించనుంది.

ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోని (10,123) మాత్రమే ఈ మార్క్‌ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డుని ఇప్పటి వరకు 12 మంది క్రికెటర్లు అందుకోగా అందులో నలుగురు భారత క్రికెటర్లే ఉండటం గర్వకారణం. శ్రీలంకతో ఆగస్టు 18, 2008లో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అనతికాలంలోనే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఈ దశాబ్దకాలంలో ఇప్పటి వరకు 211 వన్డేలు అడిన కోహ్లీ 58.21 సగటుతో 9,779 పరుగులు చేశాడు. ఇందులో 35 శతకాలు, 48 అర్ధశతకాలు ఉండటం విశేషం. వెస్టిండీస్ తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో ఒక శతకం బాది సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. బలహీనమైన కరీబియన్ బౌలింగ్‌ని ఎదుర్కొని ఐదు వన్డేల్లో 221 పరుగులు చేయడం సులువే..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles