You won't believe how Azhar Ali was run out పాక్ క్రికెటర్.. భల్ భలే రనౌట్.. చూడండీ..

Azhar ali s run out could be the most bizarre dismissal of the year

pakistan vs australia 2nd test, Pakistan vs Australia, azhar ali run out,Abu Dhabi, Azhar Ali, Azhar Ali Run Out, Asad Safiq, Mitchell Starc, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Pakistan batsman Azhar Ali was run-out in the most comical fashion during the third day of the second Test against Australia in the Abu Dhabi Test.

పాక్ క్రికెటర్.. భల్ భలే రనౌట్.. చూడండీ..

Posted: 10/18/2018 05:51 PM IST
Azhar ali s run out could be the most bizarre dismissal of the year

‘మ్యాచ్‌లో బౌలర్ విసిరిన బంతి పూర్తిగా డెడ్ అయ్యే వరకూ బ్యాట్స్‌మెన్ చూపు మరల్చకూడదు’ క్రికెట్‌‌లో ఓనమాలు దిద్దించే సమయంలో కోచ్ లు చెప్పే ప్రాథమిక నియమం ఇది. కానీ.. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరినా.. కొంతమంది ఆటగాళ్లు ఏమరపాటులో ఈ నియమాన్ని మరిచిపోయి మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. తాజాగా పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ ఇలా ప్రాథమిక నియమాన్ని మరిచిపోయి రనౌట్‌తో నవ్వులపాలయ్యాడు.

ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంతి బౌండరీ లైన్‌ను తాకిందని భ్రమపడిన అజహర్ అలీ (64: 141 బంతుల్లో 4x4) పేలవ రీతిలో రనౌటయ్యాడు. ఇన్నింగ్స్ 53వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడెల్ బౌలింగ్‌లో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా అజహర్ హిట్ చేశాడు. బంతి వెళ్లిన వేగానికి అది కచ్చితంగా బౌండరీకి వెళ్లిపోతుందిలే అని భ్రమపడి.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌ నుంచి పరుగు కోసం వచ్చిన అసద్‌తో పిచ్‌ మధ్యలోనే ముచ్చట్లు పెట్టాడు.

అయితే.. వేగంగా వెళ్లిన బంతి.. బౌండరీ లైన్‌కి సమీపంలోనే ఆగిపోయింది. దీంతో.. అప్పటికే బంతి వెంట పరుగెత్తుకుంటూ వెళ్లిన ఫీల్డర్ మిచెల్ స్టార్క్ వేగంగా దాన్ని అందుకుని వికెట్ కీపర్ టిమ్ పైనీకి అందించగా.. అతను వికెట్లను గీరాటేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. ఏం జరిగిందో..? తొలుత అర్థంకానట్లు తెల్లమొహం వేసిన అజహర్ అలీ.. ఆ తర్వాత థర్డ్ అంపైర్ ఔటని ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles