MS Dhoni’s cover, Virat Kohli’s workload key issues విండీస్ తో వన్డేలకు పంత్.. ధోని ఔట్.?

India vs west indies odi squad ms dhoni s cover virat kohli s workload key issues

Team India, Rishabh Pant, ms dhoni, India vs West Indies, India ODI squad, BCCI, squad selectors, cricket, cricket news, sports news, latest sports news, sports

Mahendra Singh Dhoni’s poor batting form might force selectors to include the flamboyant Rishabh Pant when they pick the ODI squad for the limited-overs leg of the ongoing home series against the West Indies

విండీస్ తో వన్డేలకు పంత్.. ధోని ఔట్.?

Posted: 10/10/2018 05:45 PM IST
India vs west indies odi squad ms dhoni s cover virat kohli s workload key issues

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై వన్డేల్లో వేటు వేయబోతున్నారా..? అంటే అవుననే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్ తో ఈనెల 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగా కనిపిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్ పై చివరి టెస్టులో శతకం బాది వెలుగులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధోనికి ప్రమాదంగా మారనున్నాడా.? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.

గత వారం వెస్టిండీస్ తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన రిషబ్ పంత్ వైపుకే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారని సమాచారం. రిషబ్ కు వన్డేల్లోనూ వికెట్ కీపర్ గా అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ధోనీ కూడా గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నాడు. గత నెల దుబాయ్ లో ముగిసిన ఆసియా కప్ తొలి మ్యాచ్లో హాంకాంగ్‌పై డకౌటైన ధోనీ.. టోర్నీలో భారత్ ని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు.

‘ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్‌తో ధోనీ కెరీర్‌కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్‌ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసు’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చినా.. ప్రపంచకప్‌లో మాత్రం ధోనీనే ఆడిస్తామని మరో అధికారి వెల్లడించారు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోటాలో గత ఐదు నెలలుగా దినేశ్ కార్తీక్ వన్డే జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రిషబ్ పంత్ ను ధోని స్థానంలో రీప్లేస్ చేస్తారా.? లేదా.? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Rishabh Pant  ms dhoni  India vs West Indies  India ODI squad  BCCI  cricket  

Other Articles

  • I don t know what shastri has achieved in his career gautam gambhir

    రవిశాస్త్రీపై మండిపడ్డ గౌతమ్ గంభీర్

    Dec 15 | క్రికెట్‌ నుంచి ఇటీవల వీడ్కోలు తీసుకున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన టీమిండియా ఐదు... Read more

  • India record victory against australia in adelaide test

    అస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ సేన రికార్డు విజయం

    Dec 10 | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు అసీస్ గడ్డపై చరిత్ర సృష్టించింది. తమ సొంతగడ్డపై కంగారుపెట్టిన టీమిండియా.. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విజయాన్ని అందుకుంది.... Read more

  • Yasir shah fastest to 200 test wickets breaks 82 year record

    82 ఏళ్ల రికార్డును తిరగరాసిన పాక్ బౌలర్..

    Dec 06 | క్రికెట్ లో రికార్డులు బ్రేక్ చేయడం కామన్. అయితే ఏకంగా 82 ఏళ్లనాటి రికార్డును బద్దులుకొట్టి చరిత్రను తిరగరాయడం అంటే మాత్రం ఆశామాషీ కాదు. ప్రపంచ క్రికెట్ లోని అనేకమంది మహామహులు ఈ రికార్డుకు... Read more

  • India vs australia pujara wages lone battle with 16th test ton

    కంగారెత్తించిన కంగారులు.. ఒంటిచేత్తో జట్టును అదుకున్న పూజారా..

    Dec 06 | అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ ప్రారంభమైన తొలిటెస్టులో చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా పూర్తిగా చేతులెత్తేసినా.. గౌరవప్రదమైన స్కోరును ఎట్టకేలకు సాధించింది. తొలిరోజు అద్యంతం అసీస్ బౌలర్ల హవా కొనసాగింది. కంగారు బౌలర్లు... Read more

  • Lakshan sandakan overstepping came from trying too hard

    అంఫైర్ ఫెయిల్: 12 నోబాల్స్ వేసిన లంక స్పిన్నర్

    Nov 26 | కొలంబో వేదికగా ఇంగ్లాండ్‌ తో ముగిసిన మూడో టెస్టు మ్యాచులో శ్రీలంక స్పిన్నర్ లక్షణ్ సందకన్ బౌలింగ్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచులో 42 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్టుల... Read more

Today on Telugu Wishesh