India declare at 649/9 on day 2 జడేజా తొలి శతకం.. భారత్ 649/9 వద్ద డిక్లేర్..

Jadeja bowlers put india in command of first test

india vs west indies, india vs west indies rajkot test, india test match against west indies, Team India, 1st test match, west indies, cricket, cricket news, sports news, latest sports news, sports

Virat Kohli and Ravindra Jadeja ravaged a clueless West Indian attack with strokeful hundreds as India headed towards a demolishing win with another near-perfect performance on day two of the first cricket Test.

జడేజా తొలి శతకం.. భారత్ 649/9 వద్ద డిక్లేర్..

Posted: 10/05/2018 07:18 PM IST
Jadeja bowlers put india in command of first test

రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పట్టు బిగించింది. అరంగ్రేట మ్యాచ్ లోనే పృధ్వీ షా తన తొలి సెంచరీని నమోదు చేయడంతో.. విరాట్ కోహ్లీ కూడా తన 24వ శతకాన్ని నమోదు చేయడం.. దీంతో పాటు అటు అల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టెస్టు్లో తన తొలి సంచరీని అందుకోవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో భారత్ 9 వికెట్లకు 649 పరుగులు చేరిన క్రమంలో తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లేర్ చేసింది.

భారత ఇన్నింగ్స్ లో పృథ్వీ షా (134), కోహ్లీ (139), జడేజా (100)లు సెంచరీలు సాధించారు. మిడిల్ ఆర్డర్ లో జడేజా సత్తా చాటి 132 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కొద్దిలో వికెట్ కీపర్ రిషబ్ పంత్.. వంద పరుగుల మైలురాయిని అందుకోలేకపోయాడు. ఇతర బ్యాట్స్ మెన్లలో పుజారా 86, రహానే 41, పంత్ 92, అశ్విన్ 7, కుల్దీప్ యాదవ్ 12, ఉమేష్ యాదవ్ 22 పరుగులు చేశారు. మొహమ్మద్ షమీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

విండీస్ బౌలర్లలో బిషూ 4 వికెట్లు, లూయిస్ 2 వికెట్లు పడగొట్టగా... గాబ్రియెల్, ఛేస్, బ్రాత్ వైట్ లు చెరో వికెట్ తీశారు. పుజారా-షాల మధ్య 206 పరుగులు, కోహ్లీ-రహానేల మధ్య 105 పరుగులు, కోహ్లీ-పంత్ ల మధ్య 133 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బ్రాత్ వైట్, పావెల్ ను ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. దీంతో అటు బౌలింగ్ లో కూడా భారత్ తన సత్తాను చాటింది. తొలి రోజు అటముగిసే సమయానికి విజయం వైపు సాగుతుంది.

రెండో రోజు అటముగిసే సమయానికి విండీస్ పతనాన్ని శాసించిన భారత బౌలర్లు ఆరు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మరో మూడు రోజుల వ్యవధి వున్నా.. రెండు మూడు రోజుల్లోనే.. మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకునేందుకు కోహ్లీ సేన రెడీ అవుతుంది. ఇన్నింగ్ ప్రారంభంలోనే షమీ ఓపనెర్లు బ్రెత్ వైట్, పావెల్ వికెట్లను తీశాడు. ఆ తరువాత అశ్విన్ హోప్ వికెట్ ను గిరాటేశాడు. అనంతరం హెట్మయర్ ను జడేజా రనౌట్ గా వెనక్కు పంపగా, ఆ తరువాత అంబ్రియాను వికెట్ ను జడేజా కూలదోసాడు. ఇక డౌవ్ రిచ్ వికెట్ ను కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles